Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం(మార్చి 12న) ప్రారంభమయ్యాయి. బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Gishnudev Varma)ఉభయ సభలను ఉద్దేవించి ప్రసంగించారు. ఈ సభలను ఈనెల 27 వరకు నిర్వమించాలని బీఏసీలో నిర్ణయించారు. ఇక మార్చి 19న సభలో బడ్జెట్ ప్రవేశపోట్టనున్నారు. సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని గురువారం(మార్చి 13న) సభలో విప్ ఆది శ్రీనివాస్(Adi Srinivas)ప్రవేశ పెట్టారు. దీనిపై అధికార, విపక్ష సభ్యులు మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంపై స్పందిస్తూ, జగదీశ్ రెడ్డి 36 నిమిషాల ప్రసంగంలో 360 అబద్ధాలు ఉన్నాయని విమర్శించారు. ఆ ప్రసంగాన్ని చదివేటప్పుడు గవర్నర్(Governar) మనసు ఎంతో బాధపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే, రైతుల సమస్యల గురించి సభలో మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. దీనిపై అధికార పక్ష సభ్యులు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విప్ ఆది శ్రీనివాస్ స్పందిస్తూ, గవర్నర్‌కు గౌరవం ఇవ్వాలని, జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు సరైనవి కావని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి జగదీశ్ రెడ్డి బదులిస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించింది తాము కాదు, కాంగ్రెస్ పార్టీనేనని సమాధానం ఇచ్చారు.
Also Read : తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గులాబీ బాస్.. గంట ముందుగానే అసెంబ్లీకి రాక..
ఏడాదిలోనే సాధించాం..
మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత పదేళ్లలో బీఆర్‌ఎస్ చేయలేని పనులను తాము ఒక్క సంవత్సరంలోనే సాధించామని, వారి వైఫల్యాలను తమ సభ్యులు సభలో ఎత్తి చూపారని అన్నారు. ఈ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ సభలో జోక్యం చేసుకుని, గవర్నర్ ప్రసంగంలోని అంశాలపైనే చర్చ జరగాలని సూచించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై జగదీశ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సభా సాంప్రదాయాలకు ఏది విరుద్ధమో స్పష్టంగా చెప్పాలని, సభ స్పీకర్ ఒక్కరిది కాదు, అందరిదని వ్యాఖ్యానించారు. దీనికి స్పీకర్ బదులిస్తూ, తనను ప్రశ్నించడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
కమశిక్షణ చర్యలకు డిమాండ్..
కాంగ్రెస్ సభ్యులు జగదీశ్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. సభలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో, స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. వాయిదా తర్వాత, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs)గంగుల కమలాకర్, సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. సభలో జరిగిన పరిణామాలపై చర్చించారు. శ్రీధర్ బాబు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, సస్పెన్షన్ విషయంపై సంప్రదింపులు జరిపారు. ఒకవేళ జగదీశ్ రెడ్డి క్షమాపణలు చెప్పకపోతే, ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు..
ఇదిలా ఉండగా, బీఆర్‌ఎస్ నేతలు హరీశ్ రావు, గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్ స్పీకర్ గడ్డం ప్రసాద్(Gaddam Prasad)ను ఆయన ఛాంబర్‌లో కలిశారు. సభలో జరిగిన గందరగోళం గురించి వివరించారు. జగదీశ్ రెడ్డి స్పీకర్ సీటును ఉద్దేశపూర్వకంగా కించపరచలేదని, గౌరవంగానే మాట్లాడారని వారు స్పీకర్‌కు వివరించారు.
Also Read : కుక్క సావు చస్తావు.. పిచ్చి కుక్కలకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి