MLA Padi Kaushik Reddy : తెలంగాణలో తిట్ల రాజకీయాలు కొత్తేం కాదు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు విపక్ష నేతలపై, ప్రధాని మోదీ(PM modi)పై నోటికి వచ్చినట్లు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆంధ్రులను ఉద్దేశించి తీవ్ర పదాలు వాడారు. ఇక ఇప్పుడు అధికారం కల్పోయారు. మౌనంగా ఉంటున్నారు. ఆ బాధ్యతను ఇప్పుడ కేటీఆర్ ఎత్తుకున్నారు. కేటీఆర్ తీరుగానే ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. తాజాగా హుజారాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి(Padi Koushik Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వివాదాలకు కారణమయ్యాయి, తెలంగాణ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.
Also Read : తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గులాబీ బాస్.. గంట ముందుగానే అసెంబ్లీకి రాక..
కుక్కచావు చస్తాడు..
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద కౌశిక్‌రెడ్డి గురువారం(మార్చి 13న) మాట్లాడారు. ఆరు గ్యారెంటీ(Six Garantees) హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి.. వాటిని నెరవేర్చకపోవంతో ప్రజలు తీవ్రంగా ధూషిస్తున్నారన్నారు. శాపనార్థాలు పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ శాపనార్థాలతో సీఎం రేవంత్‌రెడ్డి కుక్కచావు చస్తాడు అని తీవ్ర పదజాలం వాడారు.
పిచ్చి కుక్కల సంఘం అధ్యక్షడు..
ఇక రేవంత్‌రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌పై బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగం(Governar Speech)అనంతరం కేటీఆర్ తెలంగాణ స్ట్రెచర్‌పై ఉందని మాట్లాడారు. దీనికి సీఎం రెస్పాండ్ అయ్యారు. స్ట్రెచర్‌పై ఉన్నవారు ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసని, వారు అటునుంచి అటే శ్మశానానికి పోతారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కౌశిక్‌రెడ్డి గురువారం స్పందించారు. విపక్ష నేతల చావు కోరుకునే సీఎం రేవంత్‌రెడ్డి పిచ్చికుక్కల సంఘం అధ్యక్షుడని మండిపడ్డారు.
గతంలోనూ నోటి దురుసు..
పాడి కౌశిక్‌రెడ్డి గతంలోనూ నోటిదురుసు ప్రదర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై నోరు పారేసుకున్నాడు. ‘భారతదేశంలోనే అందరికంటే పెద్ద తుగ్లక్ ముఖ్యమంత్రి‘ అని విమర్శించారు. ‘రేవంత్ రెడ్డి గురించి నాకు అంతా తెలుసు, నీవు ఎక్కడికి వెళతావో, ఏం చేస్తావో నాకు తెలుసు. నేను చెప్పేది నీ పిల్లలు వింటే నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వరు‘ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : మరో మరో ఢిల్లీకి రేవంత్..
తెలంగాణ ప్రజలు పెట్టే శాపాలకి రేవంత్ రెడ్డి కుక్క సావు సస్తడు – పాడి కౌశిక్ రెడ్డి pic.twitter.com/oSUKF5ScYZ
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2025
రాష్ట్రంలో ఉన్న పిచ్చి కుక్కలకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి pic.twitter.com/xTobLGsVnp
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2025