spot_img
HomeతెలంగాణTelangana Teachers Promotion: టీచర్లకు గట్టి షాక్.. ప్రమోషన్లు కట్.. పనిచేస్తేనే ముందుకు..

Telangana Teachers Promotion: టీచర్లకు గట్టి షాక్.. ప్రమోషన్లు కట్.. పనిచేస్తేనే ముందుకు..

Telangana Teachers Promotion: ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందంటే లైఫ్‌సెట్‌ రా.. అంటారు. ఎందుకంటే రాజ్యాంగం వారికి అలాంటి భద్రత కల్పించింది. కానీ ప్రైవేటులు ఎలాంటి రక్షణ ఉండదు. పనిచేస్తే చేయించుకుంటారు. లేదంటే తీసిపడేసి మరొకరిని పెట్టుకుంటారు. కానీ, ప్రభుత్వ ఉద్యోగులు పని చేసినా.. చేయకపోయినా.. తొలగించడం ఉండదు. మహా అయితే సస్పెండ్‌ చేస్తారు. తర్వాత తిరిగి తీసుకుంటారు. ఇక పదోన్నతులు అయితే.. సీనియారిటీ పెరిగే కొద్ది వస్తుంది. ఇందులోనూ రిజర్వేషన్లు ఉంటే ఇంకా తొందరగా వస్తుంది. ఇక ప్రభుత్వ విద్య గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 99 శాతం మంది టీచర్లకే తాము చెప్పే చదువుపై నమ్మకం లేదు. అందుకే తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లకు పంపుతారు. ఇక సర్కార్‌ బడికి వచ్చే పిల్లలకు మాత్రం ఏదో చెప్పాలి కాబట్టి అన్నట్లుగా పాఠాలు చెబుతుంటారు.

Also Read: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం..
తెలంగాణలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేలా చర్యలు చేపడుతోంది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పటికే విద్యావిధానంలో మార్పులు చేసింది. అడ్మిషన్లు పెంచే బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగించింది. ఇక ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియారిటీ ఆధారంగా ఉపాధ్యాయులకు ఇచ్చే పదోన్నతులు రద్దు చేసింది. ఇకపై పనితీరు ఆధారంగానే ప్రోత్సాహకాలు, పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఐదేళ్లకు ఒకసారి ఉపాధ్యాయుల పనితీరును మూల్యాంకనం చేస్తారు.

మెరుగుపడకపోతే ఉద్యగం ఊస్ట్‌..
పనితీరు మెరుగుపడకపోతే, రెండేళ్ల సమయం ఇచ్చి సర్వీస్‌ నుంచి తొలగించే నియమాలు రూపొందించాలని కమిషన్‌ సూచించింది. ఈ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి టేబుల్‌ మీద ఉంచింది. విద్యా రంగంలో నెలకొన్న నిర్లక్ష్యం, ప్రభుత్వ పాఠశాలలపై సడలిన విశ్వాసాన్ని పునరుద్ధరించడమే ఈ కొత్త నిబంధనల లక్ష్యం.

ఈ సూచనలు తెలంగాణ విద్యా వ్యవస్థకు విప్లవాత్మక మలుపు తిప్పుతాయి. ప్రస్తుతం సేవా కాలం ఆధారంగా పదోన్నతులు వచ్చే వ్యవస్థ ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని తగ్గిస్తోంది. పనితీరు మూల్యాంకనం ద్వారా బాధ్యతను పెంచడం విద్యార్థుల ప్రయోజనానికి దారితీస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper