Homeలైఫ్ స్టైల్Life Cycle Fund Investment: 'లైఫ్ సైకిల్ ఫండ్స్' లో పెట్టుబడులు కరెక్టేనా? ఇవి ఎవరికి...

Life Cycle Fund Investment: ‘లైఫ్ సైకిల్ ఫండ్స్’ లో పెట్టుబడులు కరెక్టేనా? ఇవి ఎవరికి ఉపయోగం?

Life Cycle Fund Investment: మనిషి బతకడానికి డబ్బు చాలా అవసరం. అయితే ఈ డబ్బు ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ఎప్పుడు తక్కువగా ఉంటుంది? అనేది మన చేతుల్లో ఉండదు. ఎక్కువగా ఆదాయం వచ్చినప్పుడు దానిని సేఫ్ చేసుకోవాలి. ఈ సేవింగ్ అనేది పెట్టుబడుల రూపంలో ఉంటే భవిష్యత్తులో చాలావరకు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే మార్కెట్లో ప్రస్తుతం చాలావరకు పెట్టుబడులు వస్తున్నాయి. ఇందులో ఏది బెటర్? అనేది చాలామందికి ఎదురవుతున్న ప్రశ్న. పిల్లల చదువులు, రిటైర్మెంట్ […]

Life Cycle Fund Investment: మనిషి బతకడానికి డబ్బు చాలా అవసరం. అయితే ఈ డబ్బు ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ఎప్పుడు తక్కువగా ఉంటుంది? అనేది మన చేతుల్లో ఉండదు. ఎక్కువగా ఆదాయం వచ్చినప్పుడు దానిని సేఫ్ చేసుకోవాలి. ఈ సేవింగ్ అనేది పెట్టుబడుల రూపంలో ఉంటే భవిష్యత్తులో చాలావరకు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే మార్కెట్లో ప్రస్తుతం చాలావరకు పెట్టుబడులు వస్తున్నాయి. ఇందులో ఏది బెటర్? అనేది చాలామందికి ఎదురవుతున్న ప్రశ్న. పిల్లల చదువులు, రిటైర్మెంట్ జీవితం కోసం ఆలోచించేవారు ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అని నిత్యం సెర్చ్ చేస్తున్నారు. ఇలాంటి వారి కోసం SEBI లైఫ్ సైకిల్ ఫండ్స్ అనే కొత్త కాన్సెప్ట్ ఆకర్షిస్తోంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీని గురించి పూర్తి వివరాలు లోకి వెళితే..

Also Read: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

చాలామంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రకరకాల పెట్టుబడులు చేస్తుంటారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉన్నవారు నేరుగా స్టాక్స్ కొంటారు… లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఇవి ఒక్కోసారి పెరగడం లేదా తగ్గడం జరుగుతూ ఉంటాయి.. ఈ పరిస్థితుల్లో కొంతమంది తమ పనులను వదులుకొని వీటి గురించి ప్రత్యేకంగా టైం కేటాయించలేరు. అయితే ఇప్పుడు సెబి లైఫ్ సైకిల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ కు అనుగుణంగా ఈ పెట్టుబడులు వెళ్లి ఎక్కువగా లాభదాయకంగా ఉండేలా మారుతూ ఉంటాయి.

లైఫ్ సైకిల్ ఫండ్ అనేది ఒక కాలాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం. కొన్ని ఏళ్ల తర్వాత పెట్టుబడులు పెడితే ఎంతవరకు ఆదాయం వస్తుంది? అన్న ఆలోచన ఉన్నవారు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఉదాహరణకు 15 ఏళ్ల తర్వాత పిల్లల చదువుకు డబ్బులు కావాలి.. లేదా 25 ఏళ్ల తర్వాత రిటర్మెంట్ అండ్ కావాలి.. అని అనుకునేవారు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవసరానికి తగినంత లాభంతో అందిస్తారు. సాధారణంగా షేర్ మార్కెట్ కొంటే ప్రారంభంలో లాభాలు రావచ్చు. ఈ సమయంలో రిస్కు కూడా ఉంటుంది. అయితే లైఫ్ సైకిల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువగా లాభం వచ్చే విధంగా చేస్తారు. అంతేకాకుండా లక్షకాలం దగ్గర పడుతున్న కొద్ది రిస్క్ ను తగ్గిస్తూ ఈ డబ్బును బాండ్లు, డిపాజిట్లు వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లిస్తారు. దీనినే గ్లైడ్ పాత్ వ్యూహం అంటారు.

సాధారణంగా నేరుగా పెట్టుబడులు పెడితే మార్కెట్ ఎప్పుడు పడుతుంది? ఎప్పుడు గ్రోత్ ఉంటుంది? అని ఆందోళన ఉంటుంది. కానీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫండ్ మేనేజర్ సరైన నిర్ణయం తీసుకుంటూ వాటిని అవసరానికి అందిస్తారు. ఇందులో దాదాపు రిస్కు లేకుండానే చేస్తారు. ప్రారంభంలో కాస్త ఒడిదుడుకులు ఏర్పడినా కూడా.. చివరి సమయంలో సేఫ్గా ఉంచి తగినంత వడ్డీని అందిస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper