HomeతెలంగాణMunicipal Elections Results: జనాలు ఓట్లేసి గెలిపించలేదు..డబ్బులు, కుక్కర్లు లాగేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి

Municipal Elections Results: జనాలు ఓట్లేసి గెలిపించలేదు..డబ్బులు, కుక్కర్లు లాగేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి

Municipal Elections Results: ఎన్నికల జరుగుతున్నప్పుడు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. డబ్బు.. ఇతర కానుకలు ఇచ్చి ఓటర్లను తమ వైపు మళ్లించుకుంటారు.

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ధన ప్రవాహం బీభత్సంగా ఉంటుంది. ఆ సమయంలో డబ్బు, ఇతర కానుకలు భారీగానే దక్కుతాయి.

స్థానిక ఎన్నికలలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేస్తారు. కానుకలు ఇస్తూ ఉంటారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని మార్గాలను ఉపయోగించుకుంటారు.

కొన్ని ప్రత్యేకమైన స్థానాలలో అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తూ ఉంటారు. డబ్బుతో పాటు విలువైన వస్తువులు కూడా కానుకలుగా అందిస్తూ ఉంటారు. ఎలాగైనా సరే గెలవాలని భావిస్తుంటారు. ఇంత స్థాయిలో ఖర్చుపెట్టినప్పటికీ కొన్ని సందర్భాలలో అభ్యర్థులు గెలవడానికి అవకాశం ఉండదు. ఆ సమయంలో గెలిచిన అభ్యర్థి ఆనందంగా ఉంటే.. ఓడిపోయిన అభ్యర్థి విచారంలో ఉంటాడు. కొన్ని సందర్భాలలో ఓడిపోయిన అభ్యర్థులు తమ ఇచ్చిన కానుకలను తిరిగి ఇవ్వాలని ఓటర్లను డిమాండ్ చేస్తారు. ఇటువంటి సంఘటనలు గతంలో అనేకం చోటుచేసుకున్నాయి.

ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల్లో అశ్వరావుపేట పురపాలకంలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్న అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో పదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేశారు. అయితే తనకు కొంతమంది ఓటు వేయలేదని గుర్తించి.. వారికి ఇచ్చిన కానుకలను, డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కుక్కర్లు, డబ్బులు తీసుకున్న ఓటర్లు తిరిగి ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ ఇంటికి వచ్చి అవమానకరంగా మాట్లాడారని.. ఆయన ఇచ్చిన డబ్బులు.. కుక్కర్లు తిరిగి చేస్తున్నామని ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానుకలను తిరిగి ఇవ్వమని కోరిన నేపథ్యంలో గులాబీ పార్టీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. ఓటర్లు కుక్కర్లో ఇస్తుండగా ఆ దృశ్యాలను వీడియో రూపంలో చిత్రీకరించింది. వాటిని కాస్త సోషల్ మీడియాలో పెట్టింది. తద్వారా కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది. అదే గతంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ తరహా సంఘటనలు కూడా అనేకం చోటు చేసుకున్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ సంఘటనలను బయటపెట్టింది.. ఇప్పుడు ఆ బాధ్యతను గులాబీ పార్టీ సోషల్ మీడియా భుజాలకి ఎత్తుకుంది. ఇక్కడ పార్టీలు మాత్రమే మారాయి.. అభ్యర్థులు మాత్రమే మారారు.. జరిగిన ఘటనలు మాత్రం దాదాపుగా ఒకటే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Kerala Innovation

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper