HomeతెలంగాణMaoists Surrender Demands Telangana: ‘మావో’ళ్లు అనుకున్నాం.. కానీ స్వార్థపరులే.. లొంగుబాటలో ఏం అడిగారో తెలుసా?

Maoists Surrender Demands Telangana: ‘మావో’ళ్లు అనుకున్నాం.. కానీ స్వార్థపరులే.. లొంగుబాటలో ఏం అడిగారో తెలుసా?

Maoists Surrender Demands Telangana: మావోయిస్టులతో సైద్ధాతికంగా విభేదించే వారు కూడా వాళ్లు అడవులకు వెళ్లి కష్టపడ్డారు. ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. సిద్ధాంతం కోసం పోరాడుతున్నారు అన్న గౌరవం ఉండేది. వాళ్ల చేతుల్లో చనిపోయిన వారి కుటుంబాల్లో కూడా గౌరవం ఉండేది. అన్నల చేతుల్లో తమ వారు చనిపోయారని చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు. అయితే తాజా లొంగుబాట్లు మనసుకు విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే సరెండర్‌ అయినవాళ్లు అన్నింటికన్నా ఎక్కువ బాధపడుతున్నది వారి కోరికలు చూసి. ఇంతకాలం ప్రజల కోసం పోరాడుతున్నామని […]

Maoists Surrender Demands Telangana: మావోయిస్టులతో సైద్ధాతికంగా విభేదించే వారు కూడా వాళ్లు అడవులకు వెళ్లి కష్టపడ్డారు. ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. సిద్ధాంతం కోసం పోరాడుతున్నారు అన్న గౌరవం ఉండేది. వాళ్ల చేతుల్లో చనిపోయిన వారి కుటుంబాల్లో కూడా గౌరవం ఉండేది. అన్నల చేతుల్లో తమ వారు చనిపోయారని చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు. అయితే తాజా లొంగుబాట్లు మనసుకు విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే సరెండర్‌ అయినవాళ్లు అన్నింటికన్నా ఎక్కువ బాధపడుతున్నది వారి కోరికలు చూసి. ఇంతకాలం ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్పినవాళ్లు లొంగిపోయాక వ్యక్తిగత ప్రయోజనాలు కోరుకోవడం అందనికీ ఇబ్బందిగా అనిపిస్తుంది.

Also Read: బిఆర్ నాయుడు రూపంలో కూటమికి కొత్త తలనొప్పి!

ప్రస్తుత డిమాండ్లు ఇవీ..
పూర్వ మావోయిస్టులు సిద్ధాంత విభేదాలతోనూ అడవుల్లో పోరాడారు, వారి కుటుంబాలు కూడా తల ఎత్తి నడిచేవి. ఇటీవల లొంగిన నేతలు మావోయిజం పతనాన్ని సూచిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీలో పేదల భూములు, సంక్షేమ పథకాలు అడగకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో లొంగిపోయిన మావోయిస్టులకు ఎక్కువ డబ్బులు ఇచ్చార.. మీరు తక్కువ ఇచ్చారని తెలిపారు. ఇది హింసాత్మక చరిత్రకు విలువ కట్టినట్టు కనిపిస్తూ, ప్రజల్లో నిరాశ కలిగిస్తోంది.

పేదల సమస్యలు పక్కకు..
లొంగుబాటు సమయంలో గిరిజనుల చదువు, ఆరోగ్యం, అభివృద్ధి గురించి ఉద్యమంలో కొనసాగామని చెప్పినవారు ఇప్పుడు తమకు మాత్రమే ఆరోగ్యశ్రీ, భద్రతా హామీలు కోరడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పోలీసుల ముందు మావోయిజం ముగుస్తుందని చెప్పినా, తమ ప్రయోజనాలకు మొగ్గు చూపడం ఉద్యమాన్ని వ్యక్తిగత కోణంలోకి నడిపించింది. ఇది మొదటి సారి సామూహిక లొంగుబాటు ప్రకటనల్లో కనిపించిన మార్పు.

అమిత్‌ షా లక్ష్యంలో కొత్త పార్టీలు పెట్టుకోవడం, హింస చేసినవారు డబ్బు హక్కుగా అడగడం మావోయిస్టుల దిగజారుడును సూచిస్తోంది. ఒకప్పుడు మద్దతుగా నిలిచినవారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, ప్రజల్లో ’ఇంతకు మా బాధ ఎందుకు’ అనే ఆవేదన మొదలైంది. ఇది ఉద్యమం గత గొప్పతనాన్ని మరచిపోయేలా చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper