spot_img
HomeతెలంగాణMahboob Ali Khan: పులి నుంచి ప్రజలకు రక్షణ కల్పించిన నిజాం రాజు..

Mahboob Ali Khan: పులి నుంచి ప్రజలకు రక్షణ కల్పించిన నిజాం రాజు..

Mahboob Ali Khan: తెలంగాణలో ఎన్నో రకాల సామ్రాజ్యాలు పరిపాలించాయి. శాలివాహనుల నుంచి నిజాం పాలన వరకు తెలంగాణను తమదైన శైలిలో అభివృద్ధి చేస్తూ వచ్చారు. తెలంగాణ చరిత్రలో హైదరాబాద్ రాజ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. హైదరాబాద్ రాజ్యం ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా నిజాం రాజుల పరిపాలనలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అనుకోవచ్చు. అయితే నిజాం రాజుల పరిపాలనలో అభివృద్ధితోపాటు కొన్ని ప్రదేశాల్లో ప్రజలకు రక్షణ కూడా కలిగిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా వన్య మృగాల నుంచి నిజాం రాజుల్లో ఒకరైన ప్రజలకు రక్షణ కల్పించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ వివరాలు లోకి వెళ్తే..

ఇటీవల పులులు జనాల్లోకి వస్తున్నాయి. గతంలో చిరుతలు మాత్రమే కనిపించగా.. ఇప్పుడు పెద్ద పులులు సైతం ప్రజల్లోకి వస్తున్నాయి. అయితే ఒకప్పుడు అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో పులుల సంచారం ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా ప్రస్తుతం మెదక్ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ వన్యమృగాల సంచారం విపరీతంగా ఉండేది. అయితే ఈ ప్రదేశంలో ఉన్న ప్రజల్లో 33 మందిని ఓ పెద్దపులి చంపేసింది. ఈ విషయం తెలుసుకున్న నిజాం రాజు పెద్దపులిని వేటాడి ప్రజలకు రక్షణ కల్పించారు. నిజాం రాజుల్లో ఆరో ప్రభువు అయిన మహబూబ్ అలీ ఖాన్ వారానికి కొన్నిసార్లు వేటకు వెళ్లేవారు. ఈ క్రమంలో ప్రస్తుతం పోచారం ప్రాంతంలోని అడవుల్లోకి వేటకు వెళ్లిన సమయంలో ఇక్కడ 33 మందిని చంపిన పులిని వేటాడి చంపినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ రాజుకు తీస్మార్ ఖాన్ అనే బిరుదు కూడా ఉంది. రెండు పులులను ఆయన చంపినట్లు ఫోటోలు కూడా ఉన్నాయి.

అయితే దట్టమైన అడవి కలిగిన ఈ పోచారం ప్రదేశం ఇప్పుడు వైల్డ్ లైఫ్ శంక్చూరి గా మారింది. మెదక్ జిల్లాలో ఉన్న ఇది పర్యాటక ప్రదేశంగా మార్చేశారు. దీనిని చూడడానికి హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తున్నారు. సుమారు 56 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యంలో ప్రస్తుతం 600కు పైగా జింకలు, నెమళ్లు, ఇతర వన్యప్రాణులు ఉన్నాయి. మెదక్ పట్టణం నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అభయారణ్యం సెలవుల్లో విహరించడం వల్ల ఎంతో హాయిగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి వెళ్లిన వారికి సఫారీ చేసే అవకాశం ఉంటుంది. పాఠశాలల విద్యార్థులు సైతం ఇక్కడికి సందర్శిస్తూ ఆహ్లాదంగా గడుపుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Oktelugu Epaper