Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Telangana » Ktr sensational comments on revanth reddy 2

KTR: చిట్టినాయుడు.. రేవంత్ రెడ్డిని తెగ టీజ్ చేస్తున్న కేటీఆర్.. ఇది మామూలు ర్యాగింగ్ కాదు!

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తగా ఆదిలాబాద్ జిల్లాలో ఓ కార్యక్రమం జరిగింది. అక్కడ వేదికను ప్రధాని మోదీతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి పంచుకున్నారు. ఇదే వేదికపై ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి ప్రశ్నంసలతో ముంచెత్తారు.

Written By: Rocky R , Updated On : September 26, 2024 / 02:48 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Ktr Sensational Comments On Revanth Reddy 2

KTR(3)

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

KTR:  `రెడీ` సినిమాలో చిట్టినాయుడు గుర్తున్నాడా? తనకు సున్నా మార్కులు వేశాడన్న కారణంతో ఏకంగా పంతులునే కొట్టిస్తాడు! మన రాష్ట్రపతి ఎవరు అని అడిగిన ప్రశ్నకు ఆ పంతులు `ప్రతిభా పాటిల్ బాబూ` అని ఏడ్చుకుంటూ సమాధానం చెప్తాడు.. `మరి లాస్ట్ టైం అబ్దుల్ కలాం అని చెప్పావ్` అని చిట్టినాయుడు అడిగితే `అది ఆ టైంలో బాబూ`.. అంటూ రోదిస్తాడు. ఇప్పడు రాష్ట్రపతి మారిపోయాడు అని చెప్తే `మారిపోతే అది నా తప్పా` అని ఎదురుతిరుగుతాడు. ఇక్కడ ఆ చిట్టినాయుడి తాత పేరు కూడా చిట్టినాయుడే.. ఈ చిన్న తెలివి తక్కువ చిట్టినాయుడిని అడ్డంపెట్టుకొని వాళ్ల అమ్మ తన మామ అయిన మూర్ఖపు పెద్ద చిట్టినాయుడిని ఇష్టంవచ్చినట్టు తిడుతూ తన కోపాన్ని తీర్చుకుంటుంది. సినిమాలో ఈ సీన్ తెలియని వారు.. ఆసీన్ ను ఎంజాయ్ చేయని వారు లేరంటే దాదాపు అతిశయోక్తికాదు! ఇప్పుడిదంతా ఎందుకు అంటరా? ఆగండాగండి అక్కడికే వస్తున్న.. ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు.. బీఅర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని l`చిట్టి నాయుడు` అని సంభోదిస్తూ తెగ ర్యాగింగ్ చేసేస్తున్నారు. ఒక్క చిట్టినాయుడు అనే కాదు.. నిన్నమొన్నటిదాకా `చోటా భాయ్`.. అనీ పిలిచాడు. రాజకీయ నేతల మధ్య దోస్తీ.. దుష్మన్ ఎలా ఉన్నా.. ఇలాంటి సెటైరికల్ పిలుపు మాత్రం ప్రజల్లో నవ్వు తెప్పిస్తున్నది.. ఒక్కో సందర్భం నుంచి కేటీఆర్ పుట్టించిన ఒక్కో పిలుపుతోనే రేవంత్ రెడ్డి యాంటీ టీం అంతా సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేసుకుంటున్నది.

*ఇంతకీ అవెలా వచ్చాయంటే..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తగా ఆదిలాబాద్ జిల్లాలో ఓ కార్యక్రమం జరిగింది. అక్కడ వేదికను ప్రధాని మోదీతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి పంచుకున్నారు. ఇదే వేదికపై ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి ప్రశ్నంసలతో ముంచెత్తారు. తెలంగాణ రాష్ట్రానికి అభివ్రుద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని, రాష్ట్రాభివ్రుద్ధికి పెద్దన్న పాత్ర పోషించాలని `బడే భాయ్` అని మోదీని సంబోధించారు. పరస్పరం విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన పార్టీ నేతలు ఒకే వేదికను పంచుకోవడం, పైగా దేశంలో అధికార, విపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఒకదానినొకటి తిట్టుకోవడం, రాష్ట్రానికి వచ్చే సరికి ఇరు పార్టీల నేతలు చెట్టాపట్టాల్ వేసుకోవడంపై తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. ఆ రెండు జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని మొదటి నుంచీ విమర్శిస్తున్న బీఆర్ఎస్కు రేవంత్ రెడ్డి అలా పట్టుబడడం మరింత బలాన్నిచ్చినట్టయింది. అప్పటి నుంచి `కేంద్రంలో బడేభాయ్.. రాష్ట్రంలో చోటే భాయ్ (రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ)` అంటూ ఎద్దేవా చేయడం మొదలుపెట్టింది.

*చంద్రబాబు నాయుడు.. తమ్ముడు చిట్టి నాయుడు
మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని చోటేభాయ్ అని పిలిచిన కేటీఆర్ తాజాగా పిలుపు మార్చారు..
కొత్తగా రేవంత్ రెడ్డిని చిట్టి నాయుడు అని పిలవడం మొదలుపెట్టారు.. దీని వెనుక మర్మం ఏమిటా? అని ఆలోచిస్తే టీడీపీలో ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడికి రేవంత్రెడ్డి శిశ్యుడని బీఆర్ఎస్ ఎప్పటినుంచో ప్రచారం చేస్తున్నది.. తెలంగాణ బద్ద శత్రవులా చూసే చంద్రబాబు నాయుడి శిశ్యుడే ఇక్కడ పాలిస్తున్నాడహో అని కోడై కూస్తున్నది.

ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిషన్) చైర్మన్ను కాంగ్రెస్ సర్కార్ అరికెపూడికి కట్టబెట్టింది. ఇప్పటికే ఫిరాయింపులపై కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్, పీఏసీ పదవి గాంధీకి ఇవ్వడంపైనా మండిపడింది. ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టేందుకు మంత్రి శ్రీధర్బాబు సందిస్తూ అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నాడని, వారి మధ్య గొడవ బీఆర్ఎస్కు చెందిన వ్యవహారమని తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ఇలా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్ వేశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన రేవంత్రెడ్డి కూడా శ్రీధర్బాబు మాటల ప్రకారం ఇంకా టీడీపీలోనే ఉన్నట్టా?అని ఎద్దేవా చేశారు. అటు చోటా (చిట్టి).. ఇటు చంద్రబాబు నాయుడులో నాయుడును తీసుకొని కొత్తగా చిట్టినాయుడు అని పిలవడం సోషల్ మీడియాలో మార్మోగుతున్నది..

-K.R.

Rocky R

Rocky R Author - OkTelugu

Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

View Author's Full Info

Web Title: Ktr sensational comments on revanth reddy 2

Tags
  • CM Revanth Reddy
  • KTR
  • Revanth reddy
  • Telangana Politics
Follow OkTelugu on WhatsApp

Related News

Kavitha on KTR Arrest: తెలంగాణ భవన్ కు తాళం, కేటీఆర్ అరెస్టు వదంతులు.. కవిత ఏమన్నారంటే?

Kavitha on KTR Arrest: తెలంగాణ భవన్ కు తాళం, కేటీఆర్ అరెస్టు వదంతులు.. కవిత ఏమన్నారంటే?

Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం.. ఎందుకంటే..?

Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం.. ఎందుకంటే..?

KTR to be arrested soon: కేటీఆర్‌ అరెస్ట్‌ ఖాయమా? తెలంగాణలో మరో సంచలనం

KTR to be arrested soon: కేటీఆర్‌ అరెస్ట్‌ ఖాయమా? తెలంగాణలో మరో సంచలనం

Ponguleti Srinivas Reddy: కేటీఆర్ పై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్

Ponguleti Srinivas Reddy: కేటీఆర్ పై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్

Sangeetha Srinivas Shocking Comments on Revanth: ఏవమ్మా.. సీఎంను పట్టుకొని ఏంటా మాటలు.. చూసుకోవాలి కదా(వీడియో)

Sangeetha Srinivas Shocking Comments on Revanth: ఏవమ్మా.. సీఎంను పట్టుకొని ఏంటా మాటలు.. చూసుకోవాలి కదా(వీడియో)

KTR ACB Investigation: ఏసీబీ విచారణ: కేటీఆర్ హాట్ కామెంట్స్

KTR ACB Investigation: ఏసీబీ విచారణ: కేటీఆర్ హాట్ కామెంట్స్

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.