Homeక్రైమ్‌Khammam child assault case : ఆ గౌస్ గాడు బీఆర్ఎస్ లీడర్.. రౌడీషీటర్.. సెటిల్మెంట్...

Khammam child assault case : ఆ గౌస్ గాడు బీఆర్ఎస్ లీడర్.. రౌడీషీటర్.. సెటిల్మెంట్ వికటించి ఇలా దొరికాడు..

Khammam child assault case : ఖమ్మం నగరంలో 12 సంవత్సరాల బాలిక మీద దారుణానికి పాల్పడిన గౌస్ మామూలోడు కాదు. వీడు ఖమ్మం నగరంలో గులాబీ పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. వీడి మీద ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉంది. భూ అక్రమాలు.. బెదిరింపులు.. వంటి వ్యవహారాలలో ఇతడి మీద చాలా కేసులు ఉన్నాయి. ఇటువంటి నేరగాడిని గులాబీ పార్టీ నాయకులు కండువా కప్పి చేర్చుకున్నారు. వీడు సెటిల్మెంట్లు చేస్తూ.. […]

Khammam child assault case : ఖమ్మం నగరంలో 12 సంవత్సరాల బాలిక మీద దారుణానికి పాల్పడిన గౌస్ మామూలోడు కాదు. వీడు ఖమ్మం నగరంలో గులాబీ పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. వీడి మీద ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉంది. భూ అక్రమాలు.. బెదిరింపులు.. వంటి వ్యవహారాలలో ఇతడి మీద చాలా కేసులు ఉన్నాయి. ఇటువంటి నేరగాడిని గులాబీ పార్టీ నాయకులు కండువా కప్పి చేర్చుకున్నారు.

వీడు సెటిల్మెంట్లు చేస్తూ.. దందాలు చేస్తూ భారీగా వెనకేసుకున్నాడు. వీడికి అమ్మాయిలు అంటే విపరీతమైన పిచ్చి. గతంలో కొంతమంది అమ్మాయిల మీద దారుణాలకు పాల్పడి చివరికి సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఈ విషయం తెలిసినప్పటికీ కూడా గులాబీ పార్టీ నాయకులు ఇతడి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బండి సంజయ్ కుమారుడి వ్యవహారం తెరమీదకి రాగానే.. కేటీఆర్ నుంచి మొదలుపెడితే హరీష్ రావు వరకు ఇంత ఎత్తున ఎగిరిపడ్డారు. గౌస్ దారుణం వెలుగులోకి వచ్చినప్పటికీ గులాబీ పార్టీ నాయకులు కొంచెం కూడా మాట్లాడలేదంటే.. ఆ పార్టీలో పరిస్థితి ఇలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పక్క పార్టీ నాయకులు చేస్తే అన్యాయం.. మనం చేస్తే మాత్రం సంసారం అన్నట్టుగా ఉంది. పైగా హరీష్ రావు నిమ్స్ లో ఆ బాలికను పరామర్శించి.. తెలంగాణ రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించడం విశేషం.

వాస్తవానికి గౌస్ పాషా దారుణానికి పాల్పడిన ఆ బాలిక బంధువులది నెల్లూరు జిల్లా. పొట్టకూటి కోసం ఖమ్మం వచ్చారు. ఆ బాలిక తాత.. బంధువులు స్థానికంగా ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనంలో వాచ్మెన్ గా ఉంటున్నారు. ఆ బాలిక వేసవి సెలవుల కోసం ఖమ్మం వచ్చింది. ఆ బాలిక మీద కన్నేసిన గౌస్.. దారుణంగా ప్రవర్తించేవాడు. ఆమెను కావాలని తాకేవాడు.

ఈ విషయాన్ని ఆ బాలిక బయటికి చెప్పుకోలేకపోయింది. అతడు అపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడల్లా భయపడి పారిపోయేది. చివరికి ఆ బాలిక ఒకరోజు అపార్ట్మెంట్ పైకి వస్తే గమనించిన గౌస్.. దారుణానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో ఆమెను అక్కడి నుంచి కింద పడేశాడు. దీంతో ఆమె నడుము విరిగింది. తీవ్రంగా గాయపడింది. ఇంత జరిగినప్పటికీ గౌస్ పాషాలో కొంచెం కూడా అపరాధ భావం కనిపించలేదు. పైగా సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నించాడు.

వీడు చేసిందే లంగా పని అనుకుంటే.. గులాబీ పార్టీ సంబంచిన కొంతమంది మాజీ కార్పొరేటర్లు రంగంలోకి దిగి ఆ బాలిక బంధువులతో మాట్లాడుకున్నారు. మూడు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. చివరికి ఈ విషయం బయటికి తెలియడంతో పోలీసులు విచారణ నిర్వహించారు. బాలిక పరిస్థితి దారుణంగా ఉండడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత గౌస్ పాషా మీద ఫోక్సో యాక్ట్ కింద కేసు పెట్టారు.

ఇటీవల బండి సంజయ్ కుమారుడి మీద అంత ఎత్తున కేటీఆర్ లేచాడు. హరీష్ రావు లేచాడు. గులాబీ కరపత్రం పిచ్చిపిచ్చిగా వార్తలను ప్రసారం చేసింది. కానీ గౌస్ విషయంలో మాత్రం నోరు మూసుకుంది. అంటే వాళ్ల పార్టీ వాడు కాబట్టి సైలెంట్ అయిపోయింది అనుకోవాలా.. అంటూ తెలంగాణ ప్రజలు విమర్శిస్తున్నారు. హరీష్ రావు ఆ పాపను పరామర్శించి.. తెలంగాణలో బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించడం విశేషం.

వాళ్ల పార్టీ వాళ్లే ఇంతటి దారుణాలకు పాల్పడుతుంటే ఇక బాలికలకు రక్షణ ఎక్కడ ఉంటుంది.. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి హరీష్ రావు బాగానే మాట్లాడారు గాని.. గౌస్ పాషా లాంటి వ్యక్తులను పార్టీలోకి చేర్చుకోడానికి ముందు ఆలోచించాలి. నేటి కాలంలో సోషల్ మీడియా బలంగా ఉంది. ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తూ ఉంటుంది. బయటపడుతూ ఉంటుంది. హరీష్ రావు చెప్పినంత మాత్రాన గౌస్ శుద్ధ పూస అయిపోడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper