Journalist Revathi Arrest
Journalist Revathi Arrest : తీన్మార్ మల్లన్న తో పోస్ట్ చూస్తే తొలి వెలుగు రఘు కాస్త హుందాగానే ఉండేవాడు. అయినప్పటికీ ప్రభుత్వం అతడు చేస్తున్న విమర్శలను తట్టుకోలేక జైలుకు పంపించింది. కానీ ఇదే భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు రవి ప్రకాష్ ఆధ్వర్యంలో మోజో టీవీ అనేది నడిచేది. దానిని రేవతి పర్యవేక్షించేవారు. అయితే టీవీ9 వ్యవహారంలో రవి ప్రకాష్ తో గొడవల వల్ల మోజో టీవీ కూడా మూతపడింది. నాటి ప్రభుత్వ పెద్దలు రేవతిని అరెస్టు చేయించారు అని ఆరోపణలు ఉన్నాయి. ఇక నాడు రేవతికి అండగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆమెకు సపోర్ట్ ఇచ్చారు. కాలం గడిచింది.. భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షంలోకి వెళ్ళింది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మోజో టీవీ మూతపడటంతో రేవతి పల్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఎవరైతే తనను అరెస్ట్ చేశారో.. ఎవరైతే తనను ఇబ్బంది పెట్టారో.. వారికి అనుకూలంగా రేవతి మాట్లాడటం మొదలుపెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే భారత రాష్ట్ర సమితికి మౌత్ పీస్ లాగా మారిపోయింది. ఈ కాలంలో యూట్యూబ్ జర్నలిస్టులు ఎవరికి ఒకరికి డబ్బా కొట్టడం పరిపాటిగా మారిపోయింది. కానీ రైతుబంధు విషయంలో ఒక రైతుతో ముఖ్యమంత్రిని బూతులు తిట్టించి.. వినడానికి ఇబ్బందికరంగా ఉన్న భాషను ప్రయోగించి.. ఆ తర్వాత ఈ వీడియోను షేర్ చేయొద్దు అని ఒక డిస్ క్లేయిమర్ ఇచ్చి రేవతి అ
సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కడుపుకు అన్నం తినేవారు ఎవరైనా సరే ఆ వీడియోను సమర్థించరు. అలాంటి వీడియోని చూసి కూడా ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండాలంటే ఎలా కుదురుతుంది..
Also Read : కుక్క సావు చస్తావు.. పిచ్చి కుక్కలకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
విమర్శ వరకు ఓకే..
పాత్రికేయులకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలలో తప్పులు జరిగితే ఎత్తిచూపే అధికారం కూడా ఉంది. మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో.. భావ ప్రకటన స్వేచ్ఛ కేవలం పాత్రికేయులకు మాత్రమే కాదు.. సామాన్య ప్రజలకు కూడా ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే పర్యవసనాలు ఇదేవిధంగా ఉంటాయి. ఇదే రేవతి గతంలో శబరిమల ఉదంతం జరిగినప్పుడు రుతుస్రావంలో ఉన్న మహిళలను అయ్యప్ప 18 మెట్లు ఎక్కించేందుకు ప్రయత్నించింది. అప్పట్లో ఆమె వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు… ఆమెను ఎందుకు ఆ దిశగా నడిపించారు.. దర్యాప్తులో తేలింది. ఇప్పుడు అదే రేవతి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై విషం కక్కుతోంది. విషయ పరిజ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతోంది. కొంతమంది రేవతి అరెస్టును తప్పు పడుతున్నారు. అలాంటి విధానం సరికాదని చెబుతున్నారు. సరే రేవతి విషయంలో ప్రభుత్వం తప్పు చేసింది అనుకుందాం. మరి రేవతి చేసింది ఏంటి.. ఒక రైతుతో అలాంటి బూతులు మాట్లాడించవచ్చునా.. వాస్తవానికి ఆ రైతు భారత రాష్ట్ర సమితి కార్యకర్త అని కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా నిరూపించింది. అలాంటప్పుడు రేవతి చేసింది తప్పే కదా.. ఆ తప్పును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకుంది.
Also Read : టీజీఆర్టీసీ లో కీలక పరిణామం.. ఏకంగా సజ్జనార్ పై ఆరోపణలు చేసిన ఉద్యోగులు
#Telangana: “I woke up about 30 mins ago, the time is about 5.15 now. The police showed up half an hour ago,” journalist @revathitweets stated in a self-recorded video at her residence.
“The police might pick me and take me. So I thought I should tell everybody. One thing is… pic.twitter.com/MMT5lFWR7H
— South First (@TheSouthfirst) March 12, 2025
CCTV footage.. The police raided the house of female journalist Revathi in Mufti this morning and arrested her. pic.twitter.com/MS1SP8AKDo
— Media5Zone News (@media5zone) March 12, 2025
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Journalist revathi arrest by telangana police
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com