Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Ustaad Bhagat Singh Entry Scene: గబ్బర్ సింగ్ లో గుర్రం మీద...

Pawan Kalyan Ustaad Bhagat Singh Entry Scene: గబ్బర్ సింగ్ లో గుర్రం మీద ఎంట్రీ ఇచ్చాడు…మరి ఉస్తాద్ లో ఎలా ఉండబోతుందంటే..?

Pawan Kalyan Ustaad Bhagat Singh Entry Scene: తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ముందు ఏ హీరో నిలబడలేడు. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి చాలా తక్కువ సమయంలోనే టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు.పవర్ స్టార్ అనే ఒక ట్యాగ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం తన అభిమానులు సైతం ఆయన సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు […]

Pawan Kalyan Ustaad Bhagat Singh Entry Scene: తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ముందు ఏ హీరో నిలబడలేడు. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి చాలా తక్కువ సమయంలోనే టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు.పవర్ స్టార్ అనే ఒక ట్యాగ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం తన అభిమానులు సైతం ఆయన సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. కానీ ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల అడపాదడపా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. గత సంవత్సరం చేసిన ఓజీ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇక దాంతో మరోసారి పవన్ కళ్యాణ్ మేనియా అయితే మొదలైంది.

Also Read: వైసిపి చేతికి ‘ఆమె’ కొత్త బాణం!

ఇక ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సైతం ఈనెల 19వ తేదీన ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…ఈ సినిమాలో పవర్ ఫుల్ పవన్ కళ్యాణ్ ని మనం చూడబోతున్నాం అంటూ హరీష్ శంకర్ చాలా రోజులుగా తన ఇంటర్వ్యూల్లో చెబుతున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట.

గబ్బర్ సింగ్ సినిమాలో గుర్రం మీద వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డైరెక్టుగా హెలికాప్టర్ నుంచి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకని ఆయన హెలికాప్టర్ ఎక్కాల్సి వచ్చింది అనేది కూడా ఈ సినిమాలో భాగంగానే చూపించబోతున్నారట. పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందా అని ప్రతి ఒక్క అభిమాని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ ను సాధించి పవర్ స్టార్ మేనియాని మరోసారి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటికే 19 వ తేదీ ఎప్పుడూ వస్తుందా సినిమా ఎప్పుడు చూద్దామా అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper