Chiranjeevi Latest Movie 2026: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్లలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. మెగాస్టార్ అనే ఒక ట్యాగ్ ను సంపాదించుకొని ఇండస్ట్రీలో భారీ సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేస్తున్నాడు… సినిమాలనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టి తన అభిమానులకు సైతం సేవ చేయాలని చెప్పిన నటుడు కూడా తనే కావడం విశేషం…ఇక ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాడు. రీసెంట్ గా ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించిన ఆయన మరోసారి భారీ సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read: వైసిపి చేతికి ‘ఆమె’ కొత్త బాణం!
ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా విషయంలో ఆయన చాలా కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా వచ్చే నెల నుంచి రెగ్యూలర్ షూట్ స్టార్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది… ప్రస్తుతం దర్శకుడు ఈ సినిమాలో నటీనటులను సెలెక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలో చిరంజీవి అన్న పాత్ర ఒకటైతే ఉందట.
దానికి కొంతమంది హీరోలను అనుకుంటున్నప్పటికి ఫైనల్ గా రజినీకాంత్ ని ఓకే చేసినట్టుగా తెలుస్తుంది. చిరంజీవి తగ్గట్టుగా వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ ఉండాలని దర్శకుడు రజనీకాంత్ ను సెలెక్ట్ చేశారట. చిరంజీవి సైతం రజినీకాంత్ తో మాట్లాడి ఓకే చేసినట్టుగా తెలుస్తుంది…
ఇక ఇప్పటికే ఈ సినిమాలో మోహన్ లాల్ ఒక డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నాడు. రజినీకాంత్ కూడా ఈ సినిమాకి ఆడ్ అవ్వడంతో ఈ సినిమా ఇండియా వైడ్ గా భారీ సెన్సేషన్ గా మారబోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి…రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పాన్ ఇండియాలో రిలీజై సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.
చిరంజీవితో ఎప్పటినుంచో నటించాలని తనకి కోరికగా ఉందని పలు సందర్భాల్లో రజనీకాంత్ తెలియజేసినప్పటికి ఆ సమయమైతే ఇప్పటి వరకు రావడం లేదట. మొత్తానికైతే బాబీ రాసుకున్న కథలో రజనీకాంత్ క్యారెక్టర్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉండడంతో అతన్ని ఆ క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది…