RTC MD Sajjanar
TGRTC : సజ్జనార్ గతంలో వరంగల్ ఎస్పీగా పని చేసినప్పుడు ఇద్దరు అమ్మాయిల మీద ఓ దుండగుడు యాసిడ్ తో దాడి చేశాడు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. ఇక వెటర్నరీ డాక్టర్ పై జరిగిన సామూహిక హత్యాచారం గతంలోనూ సజ్జనార్ కీలక చర్యలు తీసుకున్నారు. ఈ రెండు ఘటనలు సజ్జనార్ ను తెలంగాణ ప్రజలకు దగ్గర చేశాయి. విధి నిర్వహణలో ఎంతో సమర్థవంతంగా ఉంటారు.. అవినీతికి తావు ఇవ్వరని సజ్జనార్ కు పేరుంది. కరోనా సమయంలో హైదరాబాద్ లోని ఓ కమిషనరేట్ కు సీపీ గా పనిచేస్తున్న సమయంలో సజ్జనార్ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి.. అవసరమైన వారికి ప్లాస్మా అందేలా చేశారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలకు పోలీస్ శాఖ తరపు నుంచి సహాయ సహకారాలు అందేలా చేశారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ.. సజ్జనార్ కు ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చింది. ఆయనను ఆర్టీసీ ఎండిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏడాది నుంచి సజ్జనార్ ఆర్ టి సి ఎం డి గా సేవలందిస్తున్నారు. ఆర్టీసీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటు ఆయన ఆలోచనలో నుంచి పుట్టుకు వచ్చినదే. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఆర్టీసీపై భారం భారీగా తగ్గుతున్నది. అయితే అటువంటి సజ్జనార్ అవినీతికి పాల్పడ్డారంటూ మంగళవారం ఆర్టీసీలోని కొంతమంది ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగడం సంచలనగా మారింది.
Also Read : ఏపీ యూట్యూబర్ ఆగడాలు.. తెలంగాణ ఐపీఎస్ సజ్జనార్ సీరియస్.. డిజిపికి రిక్వెస్ట్!*
ఇదిగో ఆధారాలు అంటూ..
సజ్జనార్ అవినీతికి పాల్పడ్డారంటూ ఉద్యోగులు తొమ్మిది పేజీలతో కూడిన లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపించారు. అయితే దీనిపై ఆర్టీసీ వెంటనే స్పందించింది. ఆర్టీసీ లో పనిచేస్తున్న కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు, సెక్యూరిటీ గార్డులు సంస్థ నిబంధనలకు వ్యవహరించారట. దీనిపై ఫిర్యాదులు రావడంతో సజ్జనార్ వేగంగా చర్యలు చేపట్టారట. ఆరోపణలు నిజమని తేలడంతో 400 మందిని ఉద్యోగాలలో నుంచి తొలగించారట. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారు మొత్తం మంగళవారం నిరసనకు దిగారు. ఏకంగా సజ్జనార్ పై అవినీతి ఆరోపణలు చేశారు. మరోవైపు ఆర్టీసీ సంస్థ కూడా తొలగించిన ఆ 400 మంది ఉద్యోగులకు సంబంధించిన కీలక వీడియోలను విడుదల చేసింది. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా రంజుగా మారింది. సజ్జనార్ ఇప్పటివరకు ఎన్నో చోట్ల పని చేశారు. ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు రాలేదు. ఆడపిల్లలపై దాడులకు పాల్పడే వ్యక్తులపై సజ్జనార్ కఠినంగా వ్యవహరించారు. అటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూశారు. ఇక శాంతి భద్రతలను కాపాడే విషయంలో సజ్జనార్ ఏమాత్రం రాజీ పడేవారు కాదు. అయితే అటువంటి వ్యక్తిపై ఉద్యోగులు ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మరి ఈ సంఘటన ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.
Also Read : సర్కార్ తెలంగాణది.. ఆధిపత్యం కేంద్రానిది..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Tgrtc tgrtc employees make allegations against rtc md sajjanar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com