Aha Media: ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఇండియాలోనే టాప్ మోస్ట్ ఓటీటీ యాప్స్ లో ఒకటిగా నిల్చింది ఆహా మీడియా(Aha Media). ప్రముఖ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించిన ఈ ఓటీటీ సంస్థ అతి తక్కువ సమయంలోనే అల్లు అరవింద్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. దేశం లో ఏ ఓటీటీ యాప్ లో కూడా లేనన్ని ఒరిజినల్ కాన్సెప్ట్ షోస్ ఇందులో ఉంటాయి. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ఈ యాప్ ని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది. ఇలాంటి షోస్ ఒక్కటా రెండా ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటీనటులందరూ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన షోస్ ఇవి. అలా ఆడియన్స్ కి అన్ లిమిటెడ్ ఎంటెర్టైనైమెంట్ ని అందిస్తూ దూసుకుపోతున్న ఈ సంస్థ కి సంబంధించిన ఒక గాసిప్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
కేవలం ఈ ఒక్క రోజులోనే 70 మంది ఉద్యోగస్తులను తొలగించారని సోషల్ మీడియా లో ప్రచారం జరిగింది. ఎందుకు ఉద్యోగాల నుండి తీసేసారు?, ఉద్యోగస్తులు కంపెనీ రూల్స్ కి విరుద్ధంగా ఏమైనా చేసారా?, లేకపోతే లాభ నష్టాలను బేరీజు వేసుకొని సరిగా పని చేయని ఉద్యోగస్తులను తొలగించారా? అనేది తెలియాల్సింది ఉంది. ఇది కేవలం సోషల్ మీడియా లో నడుస్తున్న ఒక రూమర్ మాత్రమే, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్త అబద్దం కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్స్ ‘అన్ స్టాపబుల్’ షో కి వచ్చినప్పుడు అసంఖ్యాకమైన ట్రాఫిక్ ని కూడా తట్టుకొని నిలబడేంత టెక్నాలజీ ని మ్యానేజ్ చేసే ఉద్యోగులు ఉన్నారు. ఎన్నో ఒరిజినల్ షోస్ ని విజయవంతంగా నడిపించిన చరిత్ర ఆ ఉద్యోగస్తులది.
సోషల్ మీడియా లో ప్రచారమయ్యే ప్రతీ రూమర్ కి స్పందించి వెంటనే ఖండించే అలవాటు ఉన్న బన్నీ వాసు ఈ రూమర్స్ పై స్పందిస్తాడో లేదో చూడాలి. రీసెంట్ గానే ఈ ఓటీటీ యాప్ లో డ్యాన్స్ ఐకాన్ 2(Dance ikon 2) , చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K(Chef Mantra – Project K) వంటి ఒరిజినల్ షోస్ ప్రారంభం అయ్యాయి. వీటికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అంతే కాకుండా రీసెంట్ గా విడుదలైన కొత్త సినిమాలు కూడా కొన్ని ఇందులో అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు నాలుగు ‘అన్ స్టాపబుల్’ సీజన్స్ పూర్తి అవ్వగా, ఈ ఏడాది కొత్త సీజన్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ‘అన్ లిమిటెడ్’ గా వస్తూనే ఉంటాయి. ఇంకా ఎవరైనా ఈ యాప్ ని సబ్ స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే చేసుకోండి.
#AHA shocks employees with massive layoffs!
Over 70 employees lost their jobs in a single day without prior notice.
What could be the reason behind this sudden decision ? pic.twitter.com/0Rdy4BCXzg
— Telugu Chitraalu (@TeluguChitraalu) March 13, 2025
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Rumors about huge layoffs in aha media on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com