Oscar Best Actor Nominees 2026: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధించిన వాళ్లకి ఎక్కువగా సినిమాలను చేసే అవకాశం వస్తుంది. ప్రతి ఒక్క దర్శకుడు వాళ్ళతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది నటులకు కొన్ని అవార్డులు రావడం కూడా వాళ్ళు చాలా గౌరవప్రదంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క నటుడి టార్గెట్ కూడా ఆస్కార్ అవార్డు అందుకోవడమే, అలాంటి అవార్డు కోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇది కొందరికి మాత్రమే వరిస్తుంది. ప్రస్తుతం అవార్డుల వేడుక జరగబోతుంది… మన భారతీయ కాలమానం ప్రకారం ఈనెల 16వ తేదీన ఆస్కార్ అవార్డుల ప్రకటన వేడుకైతే జరగనుంది…ఇక ఈ ఈవెంట్ కి ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాల నుంచి చాలామంది నటులు ఆస్కార్ అవార్డుకి తమ సినిమానైతే పంపించారు. ఇక ఈసారి ఆస్కార్ అవార్డ్ అందుకోవడానికి ఉత్తమ నటుడిగా నామినేట్ అయిన కొంతమంది హీరోలు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…
Also Read: వైసిపి చేతికి ‘ఆమె’ కొత్త బాణం!
తిమోతి చాలమేట్
‘ఇంటర్ స్టెల్లర్’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న తిమోతి చాలమెట్ కాల్ మీ బై యువర్ నేమ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రొమాంటిక్ హీరోగా మారిపోయాడు…ఈ సినిమా తనకు చిన్న వయసులోనే ఆస్కార్ నామినేషన్ లోకి వెళ్లే అవకాశం కల్పించింది. ‘మార్టీ సుప్రీం’ సినిమాతో మరోసారి ఆస్కార్ బరిలో మూడో నామినేషన్ ని దక్కించుకున్నాడు. 30 ఏళ్లకే ఈ ఘనతను సాధించిన నటుడుగా తను పలు రికార్డులను కూడా సృష్టించాడు. మరి ఈ సంవత్సరమైనా అతనికి ఆస్కార్ అవార్డు దక్కుతుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
లియోనార్డో డికాప్రియో
‘టైటానిక్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటిని సంపాదించుకున్న ఈ నటుడు… తన కెరీర్ లో ఎన్నో డిఫరెంట్ పాత్రలను పోషించి నటుడిగా చాలా అవార్డులనైతే అందుకున్నాడు. ‘ద రెవనెంట్’ సినిమాతో తొలిసారి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం…ఇక ఇప్పుడు ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ అనే చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఆయన మరోసారి నామినేషన్ లో నిలిచాడు…
ఏతాన్ హాక్
తన జీవితాన్ని సైతం సినిమాలకే అంకితం అని ఈ నటుడు పలు వైవిధ్య భరితమైన పాత్రలను పోషించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని పలు సందర్భాల్లో తెలియజేశాడు…’బ్లూ మూన్’ అనే సినిమాతో ఆయన మరోసారి ఆస్కార్ నామినేషన్ కి ఎంపికయ్యాడు. ఈ సినిమాలో మనసుని కదిలించే భావోద్వేగాలను పలికించి ప్రేక్షకులందరి చేత క్లాప్స్ కొట్టించాడు. నిజానికి ఐదు పదుల వయసులో సైతం ఆయన తను ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేశాడు అనే ఒక కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాకి గాను ఆయన ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డుని అందుకుంటాడా? లేదా అనేది చూడాలి…
మైకెల్ బీ జోర్డాన్
జోర్డాన్ 2013లో చేసిన ‘ఫ్రూట్ వేల్ స్టేషన్’ తో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఈ సినిమాలో ఆయన చేసిన నటన ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘క్రీడ్’ సినిమా సైతం అతన్ని యాక్షన్ స్టార్ గా నిలబెట్టింది. ఇక బ్లాక్ పాంథర్ లో ఆయన చేసిన పాత్ర ప్రేక్షకులను విశేషంగా అలరించింది…ఇక స్పిన్నర్ లో జోర్డాన్ ద్విపాత్రాభినయంలో కనిపించి ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాడు. ఆ రెండు పాత్రల మధ్య ఉండే సంఘర్షణను అద్భుతంగా చేయడంతో అతను ఆస్కార్ బరిలో నిలిచాడు…
వాగ్నార్ మౌరా
ఎలాంటి పాత్రకైనా సరే ప్రాణం పోసి నటించగలిగే కెపాసిటీ ఉన్న నటుడు ‘వార్నర్ మౌరా’ బ్రెజిల్ సినిమా ప్రపంచం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నటుడు…ఇప్పుడు ఆయన ‘ది సీక్రెట్ ఏజెంట్’ సినిమాలో పోషించిన పాత్రకు గాను తొలిసారి ఆస్కార్ బరిలో నిలిచాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన తన నటన వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. రాజకీయ గందరగోళం లో చిక్కుకున్న మాజీ ప్రొఫెసర్ అక్కడ ఎదురయ్యే చిత్రహింసల నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది ఈ సినిమాలో చాలా బాగా నటించి చూపించాడు…ఇక తను ఇటీవల ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుల విభాగంలో ‘బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ మోషన్ పిక్చర్ డ్రామా’ లో పురస్కారం అందుకున్నాడు… ఇక ఇప్పుడు ఆయన ను ఆస్కార్ వరిస్తుందా? లేదా అనేది చూడాలి…