EMI: జీవితంలో ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. కానీ ఈ కలను కొందరు మాత్రమే నెరవేర్చుకుంటారు. ఒకప్పుడు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా పెట్టుకుని.. ఆ తర్వాత ఇల్లును నిర్మించుకునేవారు. కానీ ఇప్పుడు బ్యాంకు లోన్లు ఉండడంవల్ల చాలామంది కొత్తగా జాబ్ లోకి రాగానే ఇంటిని తీసుకుంటున్నారు. అయితే ఉద్యోగంలో చేరిన కొత్తలో నెలనెలా ఈఎంఐ కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది బ్యాంకు లోన్ పైనే ఆధారపడుతున్నారు. కానీ బ్యాంకు లోన్ వల్ల ఒక వ్యక్తి కెరీర్ నాశనం అవుతుందన్న విషయం చాలామంది గ్రహించడం లేదు. ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఎంత సంతోషంగా ఉంటుందో తెలియదు. కానీ ఇల్లు కోసం చేసే ఈ లోన్ మాత్రం కెరీర్ పై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. అదెలాగంటే?
చాలామంది యువకులు ఉద్యోగం లోకి చేరగానే తర్వాత చేసే పని పెళ్లి చేసుకోవడం. అయితే పెళ్లి చేసుకోవాలంటే బ్యాక్ గ్రౌండ్ గురించి ఎంక్వయిరీ చేస్తున్నారు. బ్యాగ్రౌండ్ లో కనీసం ఇల్లు అయినా ఉంటే చాలు అని అనుకునేవారు ఉన్నారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగంలోకి రాగానే ఇల్లు కొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇల్లు కొని మూడ్లో తమ భవిష్యత్తును పనంగా పెడుతున్నారని విషయాన్ని మరిచిపోతున్నారు. ఇల్లు కొనుక్కోవడం మంచిదే. కానీ అంతకుమించి కెరీర్ కూడా కాపాడుకోవడం చాలా అవసరం అని కొందరు నిపుణులు తెలుపుతున్నారు.
ఉదాహరణకు ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరిన తర్వాత ఇల్లు కొనుగోలు చేయడానికి బ్యాంకులోను తీసుకుంటాడు. ఈ క్రమంలో తనకు వచ్చే ఆదాయంలో కనీసం 50 శాతం వరకు ఈఎంఐను ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఒక్కసారి హోమ్ లోన్ తీసుకున్న తర్వాత కనీసం 20 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో 20 ఏళ్లపాటు అతడు ఉద్యోగంలో ఉండాల్సిందే. అంటే ఇరవై ఏళ్లపాటు అతడు వేరే ప్రయత్నాలు చేయడానికి ఆస్కారం ఉండదు. ఈ క్రమంలో ఏదైనా రిస్క్ చేయాలన్న అవకాశం ఉండదు. దీంతో ఈఎంఐ లాక్ లో పడిపోతాడు.
ఇలా చాలామంది ఈఎంఐ లాక్లో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అలా కాకుండా జీవితంలో ఇల్లు మాత్రమే ముఖ్యమని కాదు. ఒకవేళ కచ్చితంగా ఇల్లు తీసుకోవాలని అనుకుంటే తక్కువ బడ్జెట్లో ఇల్లు కొనుక్కొని.. మిగతా మొత్తాన్ని కెరీర్ పై దృష్టి పెట్టాలని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. అంటే ఒకవేళ జాబు ఉన్నా లేకున్నా.. ఏవైనా ప్రయోగాలు చేయడానికి సమయం తీసుకోవాలి. జాబ్ లేకపోయినా మినిమమ్ ఈఎంఐ చెల్లించేలా ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా కచ్చితంగా పెద్ద ఎత్తున ఇల్లు కొనుక్కొని ఆ మాయలో పడిపోతే జీవితం ఇరుక్కుపోయినట్లే.
చాలామంది యువకులు ఈ పొరపాటు చేసి ఈ అమ్మాయి వలలో చిక్కుకుపోతున్నారు. కొత్తగా జాబ్ రాగానే ప్రణాళిక ప్రకారం గా ఆదాయాన్ని పని చేసుకుని వాటి ప్రకారంగా ముందుకు వెళ్లాలి. అప్పుడే ఓవైపు అవసరాలు మరోవైపు జీవితం హాయిగా ఉంటుంది.