HomeతెలంగాణDanam Nagender : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్.. హైకోర్టు కీలక...

Danam Nagender : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Khairatabad MLA Danam Nagender : పార్లమెంట్ ఎన్నికలకు మరికొద్ది రోజులే గడువున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో రోజుకొక సంచలనం నమోదవుతోంది. ఇప్పటికే చాలామంది భారత రాష్ట్ర సమితి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరి కొంతమంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన భారత రాష్ట్ర సమితి కీలక నాయకులలో దానం నాగేందర్ ఒకరు. ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయన రేవంత్ సమక్షంలో మూడు రంగుల కండువా కప్పుకున్నారు.. ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయనకు ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఈ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు.

ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా 2023 ఎన్నికల్లో దానం నాగేందర్ విజయం సాధించారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ రాజు యాదవ్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హైకోర్టును ఆశ్రయించారు. భారత రాష్ట్ర సమితి బీ ఫామ్ మీద గెలిచిన దానం నాగేందర్ .. కాంగ్రెస్ పార్టీలో చేరారని.. ఆయనపై అనర్హత విధించాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. ఇటీవల దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

“దానం నాగేందర్ బీఅర్ఎస్ బీ ఫామ్ మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపిస్తే విజయం సాధించారు. మీరు చెప్పినట్టుగా ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇది ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధమని మీరు మీ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ విషయంలో దానం నాగేందర్ పై అనర్హత విధించాలని శాసనసభ స్పీకర్ కు మేము ఆదేశాలు జారీ చేయలేం. బీ ఫామ్ ఇచ్చింది భారత రాష్ట్ర సమితి. అలాంటప్పుడు ఆ పార్టీకి అభ్యంతరం ఉండాలి. కేవలం నియోజకవర్గం లో ఓటరుగా ఉన్న మీరు.. ఎమ్మెల్యే పై అనర్హత విధించాలని పిటిషన్ దాఖలు చేయడం ఏంటని” హైకోర్టు వ్యాఖ్యానించింది. దానం నాగేందర్ అనర్హతపై మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారని.. కోర్టు మందలించింది. కాగా, దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని.. ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో నాగేందర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు, ఉద్యమాలు చేపట్టారు. కానీ ఇప్పుడు అతనే వారికి నాయకుడు కావడంతో.. వారు అంతర్మథనం చెందుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న రాజు యాదవ్ ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు తీర్పు అతనికి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ.. దానం నాగేందర్ పై కాంగ్రెస్ కార్యకర్తలను ఆగ్రహం ఈ పిటిషన్ ద్వారా వ్యక్తమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

today horoscope

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...
July 2026 Horoscope

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...
US Iran Conflict

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...
Oktelugu Epaper