spot_img
Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీIPhone Green Dot Meaning: మీ ఫోన్ పై గ్రీన్ డాట్ కనిపిస్తోందా.. వెంటనే వీటిని...

IPhone Green Dot Meaning: మీ ఫోన్ పై గ్రీన్ డాట్ కనిపిస్తోందా.. వెంటనే వీటిని మార్చండి..

IPhone Green Dot Meaning: స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే, మనం డిజిటల్ ప్రపంచంలో ఎంత వేగంగా దూసుకుపోతున్నామో.. అంతే స్థాయిలో మన వ్యక్తిగత గోప్యత (Privacy) కూడా ప్రమాదంలో పడుతోంది. మన స్మార్ట్ ఫోన్లో కొన్ని యాప్స్ మనకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో కెమెరా, మైక్రోఫోన్‌లను వాడుతూ మన డేటాను సేకరిస్తున్నాయనే ఆందోళనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులను అలర్ట్ చేయడానికి యాపిల్ సంస్థ తన ఐఫోన్లలో ఒక అద్భుతమైన ప్రైవసీ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆ ఫీచర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఫోన్ స్క్రీన్ పైభాగంలో కనిపించే చిన్న రంగు చుక్కల ద్వారా ప్రైవసీ సురక్షితంగా ఉందో లేదో క్షణాల్లో కనిపెట్టేయవచ్చు. ఐఫోన్ వాడుతున్నప్పుడు స్క్రీన్ కుడివైపు పైభాగంలో (నెట్‌వర్క్ సిగ్నల్స్ ఉండే చోట)గ్రీన్ కలర్ చుక్క కనిపిస్తే, ప్రస్తుతం మీ ఫోన్‌లోని ఏదో ఒక యాప్ కెమెరాను ఉపయోగిస్తోందని అర్థం. కెమెరా యాప్ ఓపెన్ చేసినప్పుడు లేదా ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో ఫోటోలు తీస్తున్నప్పుడు ఈ గ్రీన్ లైట్ రావడం సహజం.కానీ, మీరు ఏ కెమెరా ఫీచర్‌ను వాడనప్పుడు కూడా ఈ గ్రీన్ చుక్క స్క్రీన్‌పై కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలి. మీకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో ఒక యాప్ మీ అనుమతి లేకుండా కెమెరా ద్వారా మిమ్మల్ని గమనిస్తోందని దానికి అర్థం.

ఐఫోన్ స్క్రీన్‌పై ఆరెంజ్ (నారింజ) లేదా ఎల్లో (పసుపు) రంగు చుక్క ప్రత్యక్షమైతే, ఫోన్‌లోని మైక్రోఫోన్ యాక్టివ్‌గా ఉందని గ్రహించాలి. ఎవరికైనా ఫోన్ కాల్ చేసినప్పుడు, వాయిస్ రికార్డర్ వాడుతున్నప్పుడు లేదా వాయిస్ మెసేజ్ పంపుతున్నప్పుడు ఈ చుక్క కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎలాంటి ఆడియో ఫీచర్లు వాడకుండా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ ఆరెంజ్ చుక్క కనిపిస్తే, ఏదో ఒక థర్డ్-పార్టీ యాప్ మీ మాటలను నిశ్శబ్దంగా రికార్డ్ చేస్తోందని అర్థం చేసుకోవాలి. మన వ్యక్తిగత సంభాషణలు లీక్ అవ్వడానికి ఇలాంటి యాప్స్ కారణమవుతుంటాయి.

ఏ యాప్ రికార్డ్ చేస్తోందో ఎలా తెలుసుకోవాలి?
స్క్రీన్‌పై చుక్కలు కనిపించినప్పుడు, అసలు ఏ యాప్ మీ కెమెరాను లేదా మైక్రోఫోన్‌ను వాడుతుందో తెలుసుకోవడం చాలా సులభం. స్క్రీన్‌పై గ్రీన్ లేదా ఆరెంజ్ చుక్క కనిపించిన వెంటనే, స్క్రీన్ పైనుంచి కిందికి స్వైప్ చేసి కంట్రోల్ సెంటర్ (Control Center) ఓపెన్ చేయాలి. కంట్రోల్ సెంటర్ పైభాగంలో ఏ యాప్ కెమెరాను లేదా మైక్రోఫోన్‌ను వాడుతోందో ఆ యాప్ పేరు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు: WhatsApp, Recently లేదా Instagram, Recentlyఅని చూపిస్తుంది.

ఈ సెట్టింగ్స్ మార్చండి

అనుమతి లేకుండా మైక్రోఫోన్, కెమెరా యాక్సెస్ తీసుకుంటున్న యాప్స్ నియంత్రించడానికి వెంటనే ఈ మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.యాప్ పర్మిషన్స్ చెక్ చేయండి. మీ ఐఫోన్ `Settings` లోకి వెళ్లి, అక్కడ `Privacy & Security` ఆప్షన్‌ను ఎంచుకోండి.అక్కడ ఉన్న `Camera` `Microphone` విభాగాలపై క్లిక్ చేయాలి. మీ ఫోన్‌లో ఉన్న ఏయే యాప్స్‌కు ఈ పర్మిషన్స్ ఉన్నాయో అక్కడ లిస్ట్ కనిపిస్తుంది. అనుమానంగా ఉన్న లేదా అవసరం లేని యాప్స్‌కు కెమెరా, మైక్రోఫోన్ పర్మిషన్లను వెంటనే టాగుల్ ఆఫ్ (Off) చేయడం ద్వారా సేఫ్ గా ఉండవచ్చు.. అయితే కేవలం ఐ.ఫోన్లలోనే కాకుండా, ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ఇప్పుడు ఇలాంటి గ్రీన్ ప్రైవసీ డాట్ ఫీచర్‌ను అందిస్తున్నారు. కాబట్టి స్మార్ట్‌ఫోన్ ఏదైనా, స్క్రీన్‌పై వచ్చే ఇలాంటి రంగు గుర్తులను గమనిస్తూ అలర్ట్‌గా ఉండటం ఎంతో ముఖ్యం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper