Homeలైఫ్ స్టైల్Type 1 Diabetes In Children: మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా...

Type 1 Diabetes In Children: మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా…

Type 1 Diabetes In Children: ఇటీవల కాలంలో పిల్లల్లో టైప్-1 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి సాధారణంగా చిన్న వయసులోనే ప్రారంభమవుతుంది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున క్లోమగ్రంథి (ప్యాంక్రియాస్)లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీయడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఫలితంగా శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతాయి. అందుకే తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడం ఎంతో అవసరమని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి […]

Type 1 Diabetes In Children: ఇటీవల కాలంలో పిల్లల్లో టైప్-1 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి సాధారణంగా చిన్న వయసులోనే ప్రారంభమవుతుంది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున క్లోమగ్రంథి (ప్యాంక్రియాస్)లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీయడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఫలితంగా శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతాయి. అందుకే తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడం ఎంతో అవసరమని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి ప్రారంభ దశలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు ఏవో చూద్దాం..

అసాధారణ దాహం:
టైప్-1 డయాబెటిస్‌కు ప్రధాన సంకేతాల్లో ఒకటి అధిక దాహం. పిల్లలు సాధారణం కంటే ఎక్కువసార్లు నీరు తాగాలని కోరుకుంటారు. నీరు తాగిన కొద్దిసేపటికే మళ్లీ దాహం వేస్తుంది. ముఖ్యంగా రాత్రివేళల్లో కూడా పదే పదే నీరు అడిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

తరచూ మూత్ర విసర్జన:
రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు శరీరం వాటిని మూత్రం ద్వారా బయటకు పంపేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో పిల్లలు పగలు, రాత్రి తరచుగా టాయిలెట్‌కు వెళ్తుంటారు. ఇంతకుముందు బెడ్ వెట్టింగ్ సమస్య లేకపోయినా అకస్మాత్తుగా రాత్రిపూట మంచం తడపడం ప్రారంభిస్తే అది కూడా హెచ్చరిక సంకేతంగా భావించాలి.

ఎల్లప్పుడూ నీరసం:
తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకున్నప్పటికీ పిల్లలు ఎప్పుడూ నీరసంగా కనిపించడం కూడా టైప్-1 డయాబెటిస్ లక్షణం కావచ్చు. శరీరానికి అవసరమైన శక్తి కోసం గ్లూకోజ్‌ను కణాలు ఉపయోగించలేకపోవడంతో పిల్లల్లో అలసట, బలహీనత, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు కనిపించవచ్చు

అకస్మాత్తుగా బరువు తగ్గడం:
పిల్లలు బాగా తింటున్నప్పటికీ వేగంగా బరువు తగ్గడం చాలా ముఖ్యమైన హెచ్చరిక. శరీరానికి ఇన్సులిన్ అందకపోవడంతో గ్లూకోజ్‌ను శక్తిగా మార్చుకోలేక కొవ్వు, కండరాలను వినియోగించడం ప్రారంభిస్తుంది. దీంతో కొద్ది రోజులు లేదా వారాల్లోనే పిల్లలు సన్నబడిపోతారు.
వీటితో పాటు కొన్ని ఇతర లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఎక్కువ ఆకలి వేయడం, చూపు మసకబారడం, చిరాకు పెరగడం, వాంతులు, కడుపునొప్పి, శ్వాసలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. టైప్-1 డయాబెటిస్‌ను పూర్తిగా నివారించే మార్గం ప్రస్తుతం లేకపోయినా, ప్రారంభ దశలో గుర్తిస్తే పిల్లలు సాధారణ జీవితాన్ని గడపగలరు. ఇన్సులిన్ చికిత్స, సరైన ఆహారం, క్రమం తప్పని రక్తంలో చక్కెర పరీక్షలతో వ్యాధిని నియంత్రించవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper