WhatsApp : స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ వాట్సప్ ఉపయోగిస్తుంటారు. ఇటీవల కాలంలో దీని వినియోగం మరింత పెరిగింది.. కొత్త కొత్త నవీకరణలు జత చేయడంతో వాట్సప్ ఏకంగా మూడు బిలియన్ల యూజర్లతో.. నంబర్ వన్ సోషల్ మెసేజింగ్ యాప్ గా అవతరించింది. ఈ నేపథ్యంలో మరింత మంది యూజర్లను సొంతం చేసుకునేందుకు వాట్సాప్ అడుగులు వేస్తోంది. త్వరలోనే మరో కొత్త ఫీచర్ ను జోడించబోతోంది.
ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ లో మెసేజింగ్ సరికొత్త రూపు సంతరించుకోనుంది.. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్ ను టెక్స్ట్ మెసేజ్ గా మార్చుకోవచ్చట.. ప్రఖ్యాత web eta సమాచారం ప్రకారం త్వరలో వాట్సాప్ యూజర్లు తమ వాయిస్ నోట్ లను టెక్స్ట్ మెసేజ్ లుగా పంపవచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. వాయిస్ కామెంట్ లేదా ఇంటర్వ్యూ వంటి వాటిని ఇతర యాప్ అవసరం లేకుండా సులభంగా టెక్స్ట్ మెసేజ్ ల రూపంలో పంపించవచ్చు.
అయితే ఈ ఫీచర్ ఇప్పుడప్పుడే అందుబాటులోకి రాదు. దీనిపై వాట్సాప్ రకరకాల కసురత్తులు చేస్తోంది. ఇంకా ఇది టెస్టింగ్ దశలోనే ఉంది. వాయిస్ నోట్ ను టెక్స్ట్ రూపంలోకి మార్చేందుకు ఈ ఫీచర్ పై నిపుణులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. అయితే త్వరలో దీనిని యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. స్పానిష్, హిందీ, పోర్చుగీస్, రష్యన్, ఇంగ్లీష్ తో పాటు అనేక భాషల్లో ఈ సౌలభ్యాన్ని తీసుకొచ్చేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే మొదట ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తుందని తెలుస్తోంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: A new feature in whatsapp voice notes can be converted into text messages
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com