Homeబిజినెస్JSW combat SUV: 360 HP పవర్..1,100 కిలోమీటర్ల రేంజ్.. టయోటా ఫార్చునర్ కు గట్టి...

JSW combat SUV: 360 HP పవర్..1,100 కిలోమీటర్ల రేంజ్.. టయోటా ఫార్చునర్ కు గట్టి పోటీ..

JSW combat SUV: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి మరో కొత్త SUV రాబోతోంది. ఇప్పటివరకు స్టీల్.. ఎనర్జీ ఇతర పారిశ్రామిక రంగాలలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న JSW గ్రూప్.. ఇప్పుడు సొంత బ్రాండ్ తో కార్ల మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా JSW combat SUV ను తీసుకొస్తోంది. ఆకర్షణీయమైన బాక్సి డిజైన్.. శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజన్.. ఆధునిక సాంకేతిక ఫీచర్లతో ఈ కారు మార్కెట్లోకి రాబోతోంది. డిసెంబర్ 4 వ తేదీన ఈ SUV ని […]

JSW combat SUV: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి మరో కొత్త SUV రాబోతోంది. ఇప్పటివరకు స్టీల్.. ఎనర్జీ ఇతర పారిశ్రామిక రంగాలలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న JSW గ్రూప్.. ఇప్పుడు సొంత బ్రాండ్ తో కార్ల మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా JSW combat SUV ను తీసుకొస్తోంది. ఆకర్షణీయమైన బాక్సి డిజైన్.. శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజన్.. ఆధునిక సాంకేతిక ఫీచర్లతో ఈ కారు మార్కెట్లోకి రాబోతోంది.

డిసెంబర్ 4 వ తేదీన ఈ SUV ని అధికారికంగా ఆవిష్కరించేందుకు కంపెనీ రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ వాహనానికి సంబంధించిన వివరాలు మార్కెట్ వర్గాల్లో ఆసక్తిని కలగజేస్తున్నాయి ముఖ్యంగా 360 హెచ్ పీ పవర్, 160 ఎన్ ఎం టార్క్..1,100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగే సామర్థ్యం దీని సొంతం.

JSW combat SUV చైనాకు చెందిన chery సంస్థ రూపొందించిన jetour T2 ఆధారంగా రూపొందినట్టు తెలుస్తోంది. అయితే భారత మార్కెట్ కు అనుగుణంగా మార్పులు చేయబోతున్నట్టు సమాచారం. JSW మోటార్స్ సంస్థకు ఇది తొలి స్వతంత్ర SUV కావడం విశేషం. మహారాష్ట్రలోని చత్రపతి శంభాజీ నగర్ ప్లాంట్ లో ఈ వాహనాన్ని అసెంబుల్ చేస్తున్నారు.

బయటి డిజైన్ విషయానికి వస్తే ఈ ఎస్ యు వి కి బాక్సి ఆకారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముందు భాగంలో చతురస్రాకార ఎల్ ఈ డీ హెడ్ ల్యాంపులు.. భారీ గ్రిల్.. బలమైన బంపర్లు.. వీల్ ఆర్చ్ లపై క్లాడింగ్.. రూఫ్ రైల్స్ రూపొందించారు. వెనుక భాగంలో స్పేర్ వీల్ అమెరికా కూడా ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. రోడ్లపై పెద్ద ఎస్ యూవీ తరహాలోనే డిజైన్ రూపొందించారు.

ఇందులో 1.5 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. దీంతోపాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కూడా ఏర్పాటు చేశారు. వీటికి 18.4 కె డబ్ల్యూహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వ్యవస్థ ద్వారా గరిష్టంగా 360 హెచ్ పీ పవర్, 610 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి అవుతుందని తెలుస్తుంది.

ఇందులో త్రీ స్పీడ్ డెడికేటెడ్ హైబ్రిడ్ ట్రాన్స్మిషన్ ఏర్పాటు చేశారు. పూర్తి చార్జింగ్ ద్వారా 90 కిలోమీటర్ల వరకు ఎలక్ట్రిక్ విధానంలో ప్రయాణిస్తుందని సమాచారం. పెట్రోల్.. ఎలక్ట్రిక్ పవర్ రెండిటిని ఉపయోగిస్తే మొత్తం 1100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని సమాచారం.

కారు లోపల విభాగంలోనూ అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇందులో 15.6 అంగుళాల ఇన్ఫో టైన్ మెంట్ టచ్ స్క్రీన్.. 10.6 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇందులో ఇతర ఫీచర్ల విషయానికొస్తే పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు.. మెమొరీ ఫంక్షన్ తో కూడిన సీట్లు.. 12 స్పీకర్ల సోనీ ఆడియో సిస్టం.. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో.. ఆపిల్ కార్ ప్లే.. 50 W వైర్లెస్ చార్జింగ్.. 540 డిగ్రీ కెమెరా వ్యవస్థ.. లెవెల్ 2 ADAS భద్రత ఇందులో ఉంది. భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగులు.. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఇందులో ఐదుగురు ప్రయాణికులు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. అంతర్జాతీయ Je tour T2 మోడల్ లో ఉన్న కొరతల ప్రకారం దీని పొడవు 4.785 మిల్లీమీటర్లు. వెడల్పు 2.006 మిల్లీమీటర్లు. వీల్ బేస్ 2,800 మిల్లీమీటర్లు. గ్రౌండ్ క్లియరెన్స్ 220 మీటర్లుగా ఉంది. బూట్ స్పేస్ 72 లీటర్ల వరకు ఉంటుంది. ఈ వాహనానికి సంబంధించి ధరపై కంపెనీ అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే ఎక్స్ షోరూం ధర 30 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ధరలతో మార్కెట్లోకి వస్తే టయోటా ఫార్చ్యూనర్.. ఎంబీ మెజస్టర్ వంటి ఎస్ యూవీ లకు ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 4న ఈ వాహనాన్ని కంపెనీ అధికారికంగా ఆవిష్కరించబోతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper