ఎన్నికల పుణ్యమా అని తమిళనాడు ప్రజలకు వరాల మీద వరాలు దొరుకుతున్నాయి. దీంతో ఇప్పుడు తమిళులు పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న పళని స్వామి ఎన్నికల ముందు భారీ తాయిలాలు ప్రకటించేశారు. హామీలైతే ఇస్తున్నారు కానీ.. వాటిని అమలు చేస్తారో లేదో తెలియకుండా ఉంది. మొత్తానికి పళనిస్వామి మాత్రం అధికారికంగా నిర్ణయాలు తీసేసుకున్నారు. రుణాల మాఫీతోపాటు విద్యార్థులందరూ పరీక్షలు రాయకుండానే పాసయ్యేలా నిర్ణయం తీసుకున్నారు.
Also Read: బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకుందా..? : తిరుపతి సీటు జనసేనకేనా..?
అయితే.. పళనిస్వామి నిర్ణయాలు చూసి తమిళ ప్రజలు కూడా నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా భయం ఇప్పుడు ఎక్కడా లేదు. స్కూళ్లు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కొద్ది రోజుల కిందట.. 9,10,11 తరగతుల విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసింది. ఒకటి నుంచి ఎనిమిది వరకు సాధారణంగానే పబ్లిక్ పరీక్షలు ఉండవు. దీంతో తమిళనాడులో అందరూ పరీక్షలు లేకుండా పాస్ అయినట్లనిపించింది. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కేనని అందరికీ అర్థమవుతూనే ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకోవడానికి పళనిస్వామి ఇలా చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఎగ్జామ్స్ రద్దుతోపాటు రైతు రుణమాఫీని సైతం ప్రకటించారు. కొన్ని షరతులు పెట్టినప్పటికీ దాదాపుగా రూ.పదిహేను వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తారు. అదే సమయంలో ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసును కూడా 60 ఏళ్లకు పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్మీట్ పెట్టిందని తెలియగానే.. మరికొన్ని ఆఫర్లు ప్రకటించారు. అందులో బంగారం రుణాల రద్దు కూడా ఉంది.
Also Read: కుప్పంలో బాబుకు చేదు అనుభవం: తమ్ముళ్ల నోట జూనియర్ ఎన్టీఆర్ మాట
ప్రస్తుతం అధికారంలో పళని స్వామి అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ అన్నీ హామీలు ఇవ్వగలిగారు. ఒకవేళ ఇవి అమలుకు నోచుకోవాలంటే ఆయన మరోసారి అధికారంలోకి రావాల్సి ఉంటుంది. లేకపోతే అమల్లోకి రావు. ఎలా లేదన్నా.. మళ్లీ మేనిఫెస్టో విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ మేనిఫెస్టోనూ మరిన్ని ఉచిత పథకాలు రెడీ అవుతాయి. మరి ఈ హామీల కోసమైనా తమిళులు మరోసారి పళని స్వామిని గెలిపిస్తారా..? లేక ప్రత్యామ్నాయ బాట పడుతారా..? అనేది ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి చూస్తే ఈ సారి తమిళనాడులో పళని స్వామికి మాత్రం ఎదురుగాలి వీస్తున్నట్లే కనిపిస్తోంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Tamil nadu to promote class 9 11 students without any exams
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com