Tamil Hero Vijay : సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. వీరిలో కొందరు సక్సెస్ ఫుల్ జీవితాన్ని కొనసాగించగా.. మరికొందరు మాత్రం చేతులు కాల్చుకున్నారు. ఇలాంటి పరిస్థితి తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఉన్నారు. అయితే తమిళ ఇళయ దళపతిగా గుర్తింపు తెచ్చుకొని స్టార్ గా మారిన హీరో విజయ్ ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సొంతంగా పార్టీ పెట్టిన సందర్భంగా వచ్చిన అశేష జనాన్ని చూసి మిగతా రాజకీయ నాయకులు ఖంగు తిన్నారు. అయితే తాజాగా విజయ్ కి ఛేదు అనుభవం ఎదురైంది. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆయన ఇంటిపైకి చెప్పు విసిరాడు.. అసలేం జరిగిందంటే?
తమిళ ఇళయ దళపతిగా పేరున్న సినీ హీరో విజయ్.. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసింది. 2024 ఫిబ్రవరి 26న ఆయన తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. ఏడాది కాలంగా ఈ పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఇది స్థాపించి ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాబలిపురంలోని పూంజేరి గ్రామంలో ఉన్న ఓ రిసార్ట్ లో అతి కొద్ది మంది పార్టీ నాయకుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. మొత్తంగా ఈ వేడుకకు పార్టీ నాయకులు, ప్రముఖులు కలిసి 2500 మంది హాజరయ్యారు.
Also Read : ఇవి ఎన్టీఆర్ నాటి రోజులు కావు.. ఎంజీఆర్ లాగా పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు.. మరి విజయ్ ఎలా సక్సెస్ అవుతాడు?
ఈ వేడుకలో భాగంగా పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ మాట్లాడుతూ భవిష్యత్ లో మన పార్ట మత సామరస్యం లేకుండా సహోదరత్వం, భాషా అభిమానంపై కృషి చేస్తుందని తెలిపారు. మన పార్టీ పటిష్టంగా మారితే డీఎంకే కు బీటలు వారుతుందని అన్నారు. రాష్ట్రంలో 1977 నాటి ఎన్నికలు పునరావ్రుతం అవుతాయని అన్నారు. అయితే అలా మారడంపై అంతా ప్రజల చేతుల్లో ఉందని అన్నారు. అంతేకాకుండా ఇక్కడున్న వాళ్లు పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేయాలని తెలిపారు.
విజయ్ పార్టీ మొదటి వార్షికోత్సవం జరుగుతున్న సమయంలో ఆయన అభిమానులు టీవీల్లో చూస్తూ ఎంజాయ్ చేశారు. మరికొందరు మొబైల్స్ లో ఆయన ప్రసంగాన్ని విన్నారు. అయితే ఓ యువకుడు మాత్రం విజయ్ ఇంటిపై చెప్పు విరిరాడు. నీలాంగరైలో ఉన్న విజయ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా వచ్చి చెప్పు విసిరాడు. అయితే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని పట్టుకునే లోపే పారిపోయాడు. అయితే ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం ఇది రాకీయ కుట్ర అని కొందరు అంటున్నారు.
అయితే ఓ వైపు పార్టీ సమావేశం జరుగుతుండగా.. మరోవైపు ఈ సంఘటన జరగడం కలకలం రేపింది. అయితే గతంలోనూ విజయ్ పై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ప్రముఖ నటుడు విజయకాంత్ కు నివాళులు ఆర్పించిన సమయంలో ఆయనపై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. మరోసారి ఈ సంఘటన జరగడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.