Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో( Pawan Kalyan) జాతీయ భావజాలం అధికం. ఇది చాలా సందర్భాల్లో వెల్లడయింది. సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయస్థాయిలో ఒక ప్రత్యేక వ్యవస్థ తేవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హిందూ ధర్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కు మద్దతు లభించింది. హిందువుల్లో ఒక రకమైన భావన పవన్ కళ్యాణ్ పై ఏర్పడింది. దానిని గుర్తించిన బిజెపి పవన్ కళ్యాణ్ సేవలను వినియోగించుకోవడం ప్రారంభించింది. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పవన్ ప్రచారానికి విశేష ఆదరణ లభించింది. బిజెపికి మద్దతుగా పవన్ ప్రచారం చేయడంతో ఆ పార్టీ విజయం సాధించింది. అయితే ప్రత్యేకంగా తమిళనాడు రాజకీయాలపై దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో అక్కడ డిఎంకె నేతలతో ఒక రకమైన భిన్న పరిస్థితులు ఎదుర్కొంటున్నారు పవన్. మొన్న మధ్యన అక్కడ డిప్యూటీ సీఎం పవన్ పై పరోక్ష విమర్శలు చేశారు. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. తాజాగా తమిళనాడులో హిందీ భాష వివాదం పై కూడా పవన్ మాట్లాడారు. అందుకు జనసేన ప్లీనరీ వేదికగా మారింది.
Also Read : టీడీపీని నిలబెట్టింది జనసేననే.. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై టిడిపి శ్రేణుల్లో ఆందోళన
* దేశ విచ్చినాన్ని సహించం
స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామంటే ఊరుకోబోమని పవన్ హెచ్చరించారు. దేశంలో అన్ని మతాలను ఒకే విధంగా చూడాలన్నారు. కొందరు ఓట్ల కోసం హిందూ మతాన్ని కించపరిస్తే సహించేది లేదన్నారు. చిన్నప్పటి నుంచి తాను శ్రీరాముడిని( Lord Sri Rama ) పూజిస్తూ పెరిగానని.. అలాంటి రాష్ట్రంలో రాముడు విగ్రహాన్ని నరికితే స్పందించకుండా ఎలా ఉండగలనని ప్రశ్నించారు. రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తను, అల్లాను ఎవరైనా ఏదైనా అనగలరా? అని బతికి బట్ట కట్టగలరా? అని పవన్ ప్రశ్నించారు. హిందూ దేవుళ్లను దర్శించినట్లుగా యేసును, మేరీ మాతను దూషించగలరా? అని నిలదీశారు. పార్వతీదేవి అమ్మవారిపై కొందరు పిచ్చి కూతలు కూస్తే మనం ఎందుకు భరించాలని ప్రశ్నించారు.
* అవి దేశ భాషలే కదా?
పవన్ కళ్యాణ్ తమిళనాడు( Tamil Nadu ) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమిళనాడులో కొందరు నేతలు సంస్కృతం, హిందీని తిడుతున్నారని.. అవన్నీ దేశ భాషలే కదా అని ప్రశ్నించారు. తమిళనాడులో హిందీని వద్దంటే ఎలా? తమిళ సినిమాలను హిందీలో డబ్ చేసి డబ్బులు సంపాదిస్తారు. కానీ హిందీ వద్దా అని ప్రశ్నించారు. పనుల కోసం బీహార్, యూపీ కూలీలు మాత్రం కావాలా? కానీ హిందీ వద్దంటారా? అని తమిళనాడు రాజకీయ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. తమిళనాడులో సంస్కృతంలో మంత్రాలు చదవద్దంటారా అని నిలదీశారు. దేశాన్ని కొందరు ఉత్తరం, దక్షిణం అని విడదీయాలని చూస్తున్నారని మండిపడ్డారు పవన్. కోపం వస్తే దేశాన్ని ముక్కలు చేయాలా అంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. దేశాన్ని విడగొట్టే ధైర్యం ఎవరికీ లేదన్నారు. నేతలు కొంచెం ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.
Also Read : పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టార్గెట్ అదేనా? నాయకుడొచ్చాడు అంటూ చిరంజీవి చెప్పకనే చెప్పాడా?
తమిళ సినిమాలని హిందీలోకి dub చెయ్యకండి..డబ్బులేమో హిందీ నుంచి కావాలి.. కానీ హిందీ మాకొద్దంటే.. అదేం న్యాయం?
పని చేసే వాళ్లందరూ బీహార్ నుండి రావాలి కానీ హిందీని ద్వేషిస్తాం అంటే ఎట్లా?
భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు!
– #PawanKalyan pic.twitter.com/qGcoDPjh8n
— Gulte (@GulteOfficial) March 14, 2025