Bajaj Chetak : ఎప్పటిదో బజాజ్ చేతక్( Bajaj Chetak) ద్విచక్ర వాహనంవాహనం.. ఆవాహనం నిండా వస్తువులు.. ముందుగా నాలుగు పదుల వయసులో ఓ వ్యక్తి.. వెనుక ఎనిమిది పదుల వయసులో ఉన్న వృద్ధురాలు కనిపించారు. విజయనగరంలోని ఆలయాల వద్ద తిరుగాడుతూ కనిపించడంతో స్థానికులు ఆరా తీశారు. అయితే ఆ ఇద్దరు తల్లీ కొడుకులు. కర్ణాటకకు చెందిన వీరు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శించేందుకు బయలుదేరారు. తాము ఎందుకు అలా చేస్తున్నది స్థానికులకు వివరించారు.
* మరో శ్రవణ కుమారుడు
తల్లిదండ్రులను కావిడిలో మోసుకుంటూ మైళ్ల మేర ప్రయాణించారు శ్రవణ కుమారుడు( shravana kumarudu) . ఆయన ఒక గుణవంతుడు. అటువంటి వ్యక్తిని గుర్తు చేసుకుంటూ సాహస యాత్రకు దిగాడు కృష్ణ కుమార్( Krishna Kumar) అనే వ్యక్తి. తల్లి కోరిక మేరకు దేశమంతా తిరిగి రావాలని భావించాడు. కర్ణాటకలోని మైసూర్ కు చెందిన కృష్ణకుమార్ గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేసేవాడు. బెంగళూరులో విధులు నిర్వహించేవాడు. అయితే తండ్రి అకాల మరణంతో వంటరైన తల్లి వద్దకు వచ్చేసాడు. తల్లి కోసం ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టాడు. తల్లికి సఫర్యలు చేస్తూ కాలం గడుపుతూ వస్తున్నాడు.
Also Read : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిమీ కంటే ఎక్కువ రేంజ్.. బజాజ్ చేతక్ కొత్త స్కూటర్.. ఫీచర్స్ అదుర్స్
* రాష్ట్రాలను తిప్పుతూ..
అయితే తనను పుణ్యక్షేత్రాలకు తిప్పాలని తల్లి కోరింది. నవ మాసాలు మోసి కనిపించిన ఆమె రుణం తీర్చుకునేందుకు నిర్ణయించాడు కృష్ణ కుమార్. ద్విచక్ర వాహనంపై అన్ని రాష్ట్రాల్లో తిప్పుతున్నాడు. ఇప్పటికే తమిళనాడు( Tamil,Tamil Nadu ), పుదుచ్చేరి, మహారాష్ట్ర, గోవా, తెలంగాణలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఆ తల్లీ కొడుకులు సందర్శించారు. ఇప్పుడు ఏపీలో ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇప్పటివరకు 92,982 కిలోమీటర్ల మేర తిరిగినట్లు చెబుతున్నారు. ఆ తల్లి కోసం దేశ సంచారానికి దిగాడు ఆ వ్యక్తి. అచ్చం బిచ్చగాడు సినిమా మాదిరిగానే తల్లి కోసం పరితపిస్తున్నాడు.
Also Read : మార్కెట్లోకి బజాజ్ సరికొత్త ఈ బైక్.. ఫీచర్స్, ధర ఎలా ఉన్నాయంటే?