Homeవింతలు-విశేషాలుAustralian Couple Indian Wedding : పెళ్లి చూడడానికి వచ్చి.. వారిద్దరు ఒక్కటయ్యారు..

Australian Couple Indian Wedding : పెళ్లి చూడడానికి వచ్చి.. వారిద్దరు ఒక్కటయ్యారు..

Australian Couple Indian Wedding :ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇక్కడివారు ఆచరించే ఆచారాలకు చాలామంది ఫిదా అయినట్లు చాలా సందర్భాల్లో తెలిసింది. ముఖ్యంగా ఇక్కడి వివాహ వ్యవస్థ ప్రత్యేకంగా ఉంటుంది. ఆచార, సాంప్రదాయాలను పాటించి వివాహం జరుపుకుంటారు. అయితే ఈ సాంప్రదాయాలను చూసిన ఆస్ట్రేలియా జెండా తాము కూడా భారతీయ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా వారు పెళ్లి చూడడానికి వచ్చి ఇక్కడి పద్ధతిలోనే ఒకటయ్యారు. అసలేం జరిగిందంటే? […]

Australian Couple Indian Wedding :ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇక్కడివారు ఆచరించే ఆచారాలకు చాలామంది ఫిదా అయినట్లు చాలా సందర్భాల్లో తెలిసింది. ముఖ్యంగా ఇక్కడి వివాహ వ్యవస్థ ప్రత్యేకంగా ఉంటుంది. ఆచార, సాంప్రదాయాలను పాటించి వివాహం జరుపుకుంటారు. అయితే ఈ సాంప్రదాయాలను చూసిన ఆస్ట్రేలియా జెండా తాము కూడా భారతీయ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా వారు పెళ్లి చూడడానికి వచ్చి ఇక్కడి పద్ధతిలోనే ఒకటయ్యారు. అసలేం జరిగిందంటే?

సాధారణంగా కొన్ని పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు అక్కడి ఆచార వ్యవహారాలు చూసి ఇష్టపడుతుంటారు. కానీ వివాహ వ్యవస్థలో మాత్రం ఎన్ని ఆచారాలు ఉన్నా తమదైన శైలిలోనే నిర్వహించుకోవాలని అనుకుంటారు. అయితే భారతదేశంలో వివాహ కార్యక్రమానికి ప్రత్యేక ఆచార సంప్రదాయాలు పాటిస్తారు. ఇక్కడ వేదమంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాలు, వివాహ తంతు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరానికి చెందిన రణసూర్య, సృజన వివాహం ఇటీవల జరిగింది. వీరి వివాహానికి ఆస్ట్రేలియా కు చెందిన బ్రాడీ, ఏమిలి అనే జంట హాజరయ్యింది. ఈ వేడుకలో ఇక్కడివారు పాటించిన ఆచార సాంప్రదాయాలను చూసి వారు మంత్రముగ్ధులయ్యారు.

దీంతో వారు కూడా భారతీయ సాంప్రదాయంలోని వివాహం నిర్వహించుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగా బ్రాడీ, ఎమిలీ వధూవరులుగా మారి అతిధులు, స్నేహితుల మధ్య ఎక్కడి ఆచారం ప్రకారం వివాహం జరుపుకున్నారు. వధువుగా మారిన ఎమిలి మెడలో బ్రాడీ తాళి కట్టాడు. జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత దండలు మార్చుకొని ఏడడుగులు నడిచారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడి ఆచార వ్యవహారాలు తమకు ఎంతో నచ్చాయని.. తమ మిత్రుల ద్వారా తమ వివాహం జరిగినందుకు తాము ఎంతో సంతోషిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో వివాహ సంప్రదాయాలు ఉన్నప్పటికీ భారతీయ వివాహ వ్యవస్థ తమకు చాలా బాగా నచ్చిందని పేర్కొన్నారు.

ప్రస్తుత కాలంలో చాలామంది ఇతర దేశాల్లో మాదిరిగా రిజిస్ట్రేషన్ మ్యారేజ్, ఉంగరాలు మార్చుకోవడం వంటి వివాహ వ్యవస్థలు భారతీయులు ఫాలో అవుతుండగా.. విదేశానికి చెందిన వారు మన దేశ సంప్రదాయాలను పాటించడం ఎంతో గర్వకారణం అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ సందర్భంగా వీరి ఫోటోలకు లైకుల వరద పారుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper