Homeక్రీడలుక్రికెట్‌Australia Women vs England Women: మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్...

Australia Women vs England Women: మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బలాబలాలు ఎలా ఉన్నాయి.. ఎవరు గెలుస్తారు..

Australia Women vs England Women: మహిళల టి20 ప్రపంచ కప్ లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం రోజు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మహిళల జట్లు ఫైనల్ మ్యాచ్లో పోటీ పడబోతున్నాయి. సమకాలీన క్రికెట్లో ఈ రెండు జట్లు అత్యంత బలమైనవి. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.. అయితే ఇంతవరకు మహిళ టి20 ప్రపంచ కప్ లో ఫైనల్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తలపడలేదు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, […]

Australia Women vs England Women: మహిళల టి20 ప్రపంచ కప్ లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం రోజు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మహిళల జట్లు ఫైనల్ మ్యాచ్లో పోటీ పడబోతున్నాయి. సమకాలీన క్రికెట్లో ఈ రెండు జట్లు అత్యంత బలమైనవి. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.. అయితే ఇంతవరకు మహిళ టి20 ప్రపంచ కప్ లో ఫైనల్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తలపడలేదు.

ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తమ చివరి 10 t20 మ్యాచ్ లలో అద్భుతమైన ప్రదర్శన చేశాయి. ఆస్ట్రేలియా పది మ్యాచ్లలో 9, ఇంగ్లాండ్ పది మ్యాచ్లలో 8 విజయాలు సాధించింది. ఇందులో ఆస్ట్రేలియా సగటు విజయం మార్జిన్ 63 పరుగులు లేదా ఎనిమిది వికెట్ల తేడాతో లేదా 37 బంతులు మిగిలి ఉండగానే నమోదయింది. ఇంగ్లాండ్ విషయంలో ఇది 46 పరుగులు లేదా ఏడు వికెట్ల తేడాతో లేదా 19 బంతులు మిగిలి ఉండగానే నమోదయింది. ఇప్పటివరకు 9సార్లు మహిళల t20 ప్రపంచ కప్ జరిగింది. ఆరుసార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 2016 లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఒక్కసారి మాత్రమే ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఇక స్వదేశంలో జరిగిన టి20 ప్రపంచ కప్ యాత్రలో ఇంగ్లాండ్ 11-0 తేడాతో విజయాల పరంపరను కొనసాగిస్తోంది. 2009 ఎడిషన్ లో ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది.

2020 నుంచి జరిగిన ముఖాముఖి పోటీలలో ఆస్ట్రేలియా 6-3 తేడాతో ఇంగ్లాండ్ మీద లీడ్ కొనసాగిస్తుంది. టి20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా జట్టు 5-2 తేడాతో ఇంగ్లాండ్ మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.. 2012, 2014, 2018 ఫైనల్స్ లో ఇంగ్లాండ్ మీద ఆస్ట్రేలియా అద్వితీయమైన విజయాలను సాధించింది.

స్వదేశంలో ప్రత్యర్ధులతో జరిగిన టి20 లలో ఇంగ్లాండ్ 11-6 లీడ్ లో ఉంది.. అయితే ఈ గణాంకాలు రెండు జట్ల బలాలను సూచిస్తున్నాయి. అయితే ఎప్పటి మాదిరిగానే ఆస్ట్రేలియానే ముందు వరుసలో ఉంది. 2018 నుంచి జరిగిన టి20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా 29 మ్యాచ్లకు 26 గెలిచింది. ఇక ఇటీవల 3 t20 ప్రపంచ కప్ లలో ఆస్ట్రేలియా అమ్మాయిలు 17 మ్యాచ్ లు ఆడారు.. ఇందులో 2024లో జరిగిన ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో సెమి ఫైనల్లో ఓడిపోయారు. అది మాత్రమే వారికి ఏకైక ఓటమి.

వేదిక ఎలా ఉందంటే

ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ లో జరుగుతుంది. ఇక్కడ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొని పరుగులు చేయడం అంత ఈజీ కాదు. ఇక్కడ ఫాస్ట్ బౌలర్లు అత్యుత్తమ ఎకానమీ రేట్లు కలిగి ఉన్నారు. తొలి ఆరు ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లు బ్యాటర్ల మీద మరింత ఒత్తిడి తీసుకు రాగలరు. తొలి ఇన్నింగ్స్ తో పోల్చి చూస్తే రెండవ ఇన్నింగ్స్ లో బంతి టర్న్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఇక్కడ జరిగిన ఐదు మహిళా టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లలో.. మూడు మ్యాచ్లలో చేజింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. ఇటీవల మ్యాచ్లో భారత్ పై 171 పరుగుల చేజింగ్లో.. ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి సాధించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper