Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli controversial statement: కోహ్లికి ఏమైంది.. ఎందుకు అలా మాట్లాడాడు..

Virat Kohli controversial statement: కోహ్లికి ఏమైంది.. ఎందుకు అలా మాట్లాడాడు..

Virat Kohli controversial statement: ఐపీఎల్ లో మరోసారి విజేతగా నిలిచింది బెంగళూరు. ఫైనల్లో గిల్ జట్టు మీద గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఫైనల్ మ్యాచ్లో బెంగుళూరు జట్టు తరఫున విరాట్ కోహ్లీ 75* పరుగులు చేశాడు . ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ట్రోఫీ గెలిచిన తర్వాత తీన్మార్ డాన్స్ కూడా చేశాడు విరాట్ కోహ్లీ. ఫైనల్ మ్యాచ్లో 75 పరుగులు చేయడం ద్వారా విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ […]

Virat Kohli controversial statement: ఐపీఎల్ లో మరోసారి విజేతగా నిలిచింది బెంగళూరు. ఫైనల్లో గిల్ జట్టు మీద గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఫైనల్ మ్యాచ్లో బెంగుళూరు జట్టు తరఫున విరాట్ కోహ్లీ 75* పరుగులు చేశాడు . ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ట్రోఫీ గెలిచిన తర్వాత తీన్మార్ డాన్స్ కూడా చేశాడు విరాట్ కోహ్లీ.

ఫైనల్ మ్యాచ్లో 75 పరుగులు చేయడం ద్వారా విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అనుకున్నాడు. గత ఫైనల్ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో బెంగళూరుకు తొలి ఐపీఎల్ ట్రోఫీ దక్కింది. ట్రోఫీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఆసక్తికర కామెంట్లు చేశాడు. అవి కాస్త సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చకు దారి తీస్తున్నాయి.

గత ఏడాది మాదిరిగా ఈసారి బెంగళూరు జట్టు మీద ఒత్తిడి లేదట.. జట్టు కోసం కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే ఒక్కడిగా నిలబడలేదట.. అతడి బాధ్యతను పంచుకునేందుకు అద్భుతమైన బృందం దొరికిందట.. అది అతడికి సంతోషం కలిగించిందట.. ఒత్తిడి లేకపోవడం వల్ల స్వేచ్ఛగా ఆడగలిగాడట. అందువల్లే పరుగులు వచ్చాయట. విజయాలు కూడా సాధ్యమయ్యాయట. విరాట్ కోహ్లీ ఈ మాటలు చెప్పడంతో.. ఈసారి బెంగళూరు జట్టు పకడ్బందీ ప్రణాళికతోనే ఐపిఎల్ లోకి వచ్చిందని అభిమానులు అంటున్నారు. అందువల్లే ఈసారి కూడా బెంగళూరు విజేత గా నిలిచిందని చెబుతున్నారు..

గత ఫైనల్ మ్యాచ్ మాదిరిగా విరాట్ కోహ్లీ ఈసారి ఆ స్థాయిలో తన విశ్వరూపాన్ని చూపించలేదు.. జట్టు గెలిచిన తర్వాత మామూలుగానే మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. తోటి ప్లేయర్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు.. కానీ గుజరాత్ జట్టును ఇబ్బంది పెట్టే విధంగా సంకేతాలు ఇవ్వలేదు. రెచ్చగొట్టే విధంగా కామెంట్లు చేయలేదు. హావ భావాలు ప్రదర్శించలేదు.. మొత్తానికి ఈసారి విరాట్ సరి కొత్తగా కనిపించాడు. అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper