Homeలైఫ్ స్టైల్Aadhaar problems solutions: ఆధార్ విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా..? డోంట్ వర్రీ..

Aadhaar problems solutions: ఆధార్ విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా..? డోంట్ వర్రీ..

Aadhaar problems solutions: భారతదేశంలో ఒక వ్యక్తికి గుర్తింపు కావాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాల్లో ఆధార్ ను కీలకంగా మార్చుకుంటున్నారు. ఆధార్ లేకుంటే ఇటువంటి పనులు జరగడం లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆధార్ ఫిజికల్ కార్డు ఉండాలని అంటున్నారు. ఇలాంటి నిబంధనలతో కొందరు పౌరులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఇంటి వద్ద ఆధార్ కార్డు మర్చిపోయి ఉండడం వల్ల సరైన సమయంలో ముఖ్యమైన పనుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో Unique Identification Authority of India (UIDAI) అధికారులు ఉపశమనం కలిగించే విషయాలను స్పష్టం చేశారు. ఇకనుంచి కొన్ని పనుల్లో ఫిజికల్ ఆధార్ కార్డు లేకున్నా పర్వాలేదని.. ఇలాంటి సమయంలో ఈ కార్డును చూపించాలని అంటున్నారు. ఇంతకీ ఏ కార్డు?

ఆధార్ కార్డు అనగానే ఆన్లైన్లో వచ్చిన దానిని డౌన్లోడ్ చేసుకొని వాడుతూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఫిజికల్ కార్డు చేతిలో లేని సమయంలో మూడు రకాల కార్డులను కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిలో ఒకటి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న పిడిఎఫ్ కార్డు, ఎం ఆధార్లో కనిపించే డిజిటల్ ఆధార్, మరొకటి పివిసి కార్డు. అయితే చాలామంది ఫిజికల్ కార్డు కావాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న ఈ ఆధార్ పై కూడా డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. అందువల్ల దీనిని కూడా సరైన ఆధార్ గానే పరిగణించాలని ఉడాయి అధికారులు చెబుతున్నారు. అయితే ఇలాంటి రకమైన కార్డులు మొబైల్ లో ఉంటే దానిని చూపించవచ్చని పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆధార్ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల దానిని స్కాన్ చేస్తే ఆధార్ సంబంధించిన వివరాలు లభ్యమవుతాయని పేర్కొన్నారు.

అయితే కొంతమంది సౌకర్యంగా ఉండడానికి PVC కార్డులు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. కానీ ఇది అన్నిచోట్ల చెల్లుబాటు అయ్యే అవకాశం లేదని అంటున్నారు. ఇది సౌకర్యంగా ఉండేందుకు మాత్రమే తయారు చేస్తున్నారని.. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న పిడిఎఫ్ లో ప్రింటు తీసుకున్న కార్డు అసలైనదని భావిస్తున్నారు. అయితే ఈ ఆధార్ పిడిఎఫ్ కార్డును అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ స్పష్టంగా కనిపించేలా ప్రింట్ తీసుకోవాలి. ఎక్కడైనా e adhhar చెల్లదంటే ఉడాయి మార్గదర్శకారులు చూపించాలని అధికారులు తెలుపుతున్నారు.

దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి అవగాహన లోపం వల్ల తప్పనిసరిగా ఫిజికల్ కార్డు కావాలని పట్టుబడుతున్నారు. అయితే వీరికి వివరణ ఇచ్చేందుకే తాజాగా కుడా అధికారులు స్పష్టమైన సూచనలు చేశారు. ఫిజికల్ కార్డు లేకున్నా మొబైల్ లో ఈ ఆధార్ ఉంటే దానిని నిరభ్యంతరంగా చూపించవచ్చని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular