Virat Kohli IPL 2026: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లతో జరిగిన వన్డే సిరీస్ ల తర్వాత విరాట్ కోహ్లీ లండన్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడు సోషల్ మీడియాలో గాని.. బయట గాని పెద్దగా కనిపించింది లేదు. విమానాశ్రయంలో మాత్రమే అతడు దర్శనమిచ్చాడు. అది కూడా విమానం దిగినప్పుడు లేదా ఎక్కినప్పుడు మాత్రమే అతడు తార లాగా విమానాశ్రయంలో మెరిసేవాడు.
Also Read: మనిషా.. పక్షా.. ఇలా జరిగిందేంటి?.. షాక్ లో ఇషాన్ కిషన్
విరాట్ కోహ్లీ ఇటీవల కులదీప్ యాదవ్ వివాహం జరిగినప్పుడు దానికి హాజరు కాలేదు. ఇటీవల నమన్ అవార్డుల కార్యక్రమానికి కూడా రాలేదు. విరాట్ కోహ్లీ ఇండియాలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు రాలేదు అనే ప్రచారం జోరందుకుంది. బెంగళూరు వర్గాలు రకరకాలుగా దీనిపై విశ్లేషణ చేసినప్పటికీ.. విరాట్ రాకపోవడానికి అసలు కారణాన్ని కొంతమంది క్రికెట్ విశ్లేషకులు అద్భుతంగా చెప్పారు. వారి విశ్లేషణ ప్రకారం..
విరాట్ కోహ్లీ ఈసారి కూడా బెంగళూరును విజేతగా నిలపాలని గట్టిగా అనుకున్నాడట. గత సీజన్లో అతడు బెంగళూరు విజయంలో కీలక భూమిక పోషించాడు. ఈసారి కూడా అంతకు మించిన బాధ్యతను నిర్వర్తించాలని బలంగా అనుకున్నాడు. అందువల్లే కేవలం ఆట మీద మాత్రమే అతడు ఫోకస్ చేశాడు. సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నాడు. కుటుంబానికి దూరంగా ఉంటే ఆ నర్వస్ తనలో ఉంటుంది కాబట్టి.. వారిని కూడా ఇండియాకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.. ఖాళీ దొరికితే చాలు తన ఒత్తిడి మొత్తాన్ని కుటుంబ సభ్యులతో మాట్లాడి దూరం చేసుకుంటున్నట్టు సమాచారం. మైదానంలో గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ.
బెంగళూరు మైదానం పై ఏర్పాటు చేసిన పిచ్ విభిన్నంగా ఉందని విశ్లేషకులు చెప్పారు. దానికి అలవాటు పడేందుకు ఏకంగా 10 రోజులపాటు విరాట్ కోహ్లీ బెంగళూరులోనే మకాం వేశాడు. పిచ్ పై రోజు గంటల తరబడి ప్రాక్టీస్ చేశాడు. రకరకాల బంతులను వేసుకొని.. తన లోపాలను సవరించుకున్నాడు. అందువల్లే విరాట్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు. 202 పరుగుల లక్ష్యాన్ని కూడా పూచిక పుల్ల మాదిరిగా పక్కన పెట్టాడు.
మొదట్లో విరాట్ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత తన విశ్వరూపం చూపించాడు. ఎక్కడా తగ్గలేదు. తగ్గే అవకాశాన్ని హైదరాబాద్ బౌలర్లకు ఇవ్వలేదు. చెత్త బంతులను మాత్రమే కాదు.. పదునైన బంతులను కూడా విరాట్ కోహ్లీ దారుణంగా శిక్షించాడు. 38 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 69 పరుగులు చేశాడు విరాట్. దీనిని బట్టి అతడి విధ్వంసం ఎలా సాగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
తన సూపర్ ఫామ్ ద్వారా 2027 వరల్డ్ కప్ కు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల గౌతం గంభీర్ ఓ సమావేశంలో మాట్లాడుతూ వన్డే వరల్డ్ కప్ విషయంలో విరాట్ కోహ్లీ గురించి ఒక అంచనాకు రాలేమని అన్నాడు. అప్పుడు జట్టు కూర్పు ఎలా ఉంటుందో చెప్పలేమని పేర్కొన్నాడు. అయితే తన సూపర్ బ్యాటింగ్ ద్వారా గౌతమ్ గంభీర్ కు స్పష్టమైన సమాధానం విరాట్ కోహ్లీ ఇస్తున్నాడని అతని అభిమానులు అంటున్నారు. ఐపీఎల్ లో మిగతా మ్యాచ్లలో కూడా విరాట్ ఇలానే బ్యాటింగ్ చేస్తే అప్పుడు గౌతమ్ గంభీర్ వద్ద సమాధానం ఉండదని.. విరాట్ అభిమానులు పేర్కొంటున్నారు. 2011లో టీమ్ ఇండియా వరల్డ్ కప్ సాధించినప్పుడు విరాట్ జట్టులో ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పుడు అతడి కెరియర్ చివరి దశలో ఉంది. ఈ క్రమంలోనే 2027 వన్డే వరల్డ్ కప్ జట్టుకు అందించి రిటర్మెంట్ ప్రకటిస్తాడని తెలుస్తోంది. 2024 లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. ఆ ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే.