Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavamshi IPL 2026: ముంబై ఇండియన్స్ లోకి వైభవ్ సూర్య వంశీ.. రాజస్థాన్ కొంప...

Vaibhav Suryavamshi IPL 2026: ముంబై ఇండియన్స్ లోకి వైభవ్ సూర్య వంశీ.. రాజస్థాన్ కొంప మునిగింది పో

Vaibhav Suryavamshi IPL 2026: ప్రస్తుత ఐపిఎల్ లో రాజస్థాన్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. పాయింట్ల పట్టికలో బలమైన బెంగళూరు, ఢిల్లీ జట్లను కాదని టాప్ స్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా ముంబై జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు చేసిన ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నది. ముఖ్యంగా ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్య వంశీ ఆడిన తీరు అభిమానులకు ఆనందాన్ని కలిగించింది.

ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో జైస్వాల్ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ.. చర్చ మొత్తం సూర్య వంశీ చుట్టూ తిరిగింది. ప్రధాన మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు సూర్య వంశీ గురించి కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి.. అయితే ఒక మాజీ క్రియేటర్ చేసిన ప్రకటన ఇప్పుడు సూర్య వంశీ గురించి ఆసక్తికరమైన చర్చను తెరపైకి తెచ్చింది.

టీమిండియా మాజీ క్రికెటర్ జతిన్ పరంజపే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. 15 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ త్వరలో ముంబై జట్టుతో ఆడతాడని పేర్కొన్నాడు.. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున అతడు విధ్వంసకరంగా బ్యాటింగ్ చేశాడు.. ముంబై జట్టు బౌలింగ్ మొత్తాన్ని సర్వనాశనం చేశాడు.. ఈ క్రమంలో అతడు ఆడుతున్న ఆట తీరును చూసి జతిన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

జతిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి . సూర్యవంశీ ఎదుగుదల అసాధారణంగా ఉంది. 2024లో రాజస్థాన్ జట్టు అతడిని 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయసైన ఆటగాడిగా అతడు పేరు తెచ్చుకున్నాడు. గత సీజన్లో గుజరాత్ జట్టుపై కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. పురుషుల టి20 క్రికెట్లో అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 35 బంతుల్లో అతడు చేసిన సెంచరీ ఐపిఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన శతకంగా నిలిచింది.

2025 సీజన్లో అతడి కేవలం నేడు మ్యాచులు మాత్రమే ఆడాడు. 206.55 స్ట్రైక్ రేట్ తో 252 పరుగులు చేశాడు. ప్రస్తుత ఐపిఎల్ లో సూర్య వంశీ బీభత్సంగా ఆడుతున్నాడు. ఇప్పటికీ ఆడిన మూడు మ్యాచ్లలో 248.97 స్ట్రైక్ రేట్ తో 122 పరుగులు చేశాడు. చెన్నై జట్టుపై 17 బంతుల్లోనే 52.. గుజరాత్ జట్టుపై 18 బంతుల్లో 31 పరుగులు.. ముంబై ఇండియన్స్ పై 14 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అతడు ఆడుతున్న తీరుతో రాజస్థాన్ జట్టు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

ముంబై ఇండియన్స్ జట్టు గతంలో హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకుంది. గతంలో అతని నాయకత్వంలో గుజరాత్ జట్టు విజేతగా నిలిచింది. ఒకసారి రెండో స్థానంలో నిలిచింది. దీంతో అతడిని ముంబై యాజమాన్యం కొనుగోలు చేసింది.. ఇప్పుడు కూడా సూర్య వంశీని అదేవిధంగా కొనుగోలు చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.

దీనిపై ఇంతవరకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు సూర్య వంశీని అంత సులభంగా రాజస్థానీ యాజమాన్యం వదులుకోదు. సూర్య వంశీ ని కొనుగోలు చేయడానికి 2024 లో జరిగిన వేలంలో రాజస్థాన్ జట్టు భారీ ధర కోట్ చేసింది. అప్పట్లో ఆ ధర ను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. గత ఏడాది అతడి ఆటను చూసిన తర్వాత రాజస్థాన్ యాజమాన్యం ఆ స్థాయిలో ధర చెల్లించడం సబబేనని క్రికెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper