Comedian Ali: ప్రముఖ కమెడియన్ అలీ ఇంట్లో తీవ్ర ఆందోళన కలిగించిన ఆరోగ్య సమస్య ఇపుడు సద్దుమణిగింది. ఆయన భార్య జుబేదా అలీకి ఇటీవల గుండె సంబంధిత సమస్య తలెత్తడంతో.. కుటుంబ సభ్యులు అత్యవసరంగా హార్ట్ సర్జరీ చేయించారు. అసలు తనకు గుండె సమస్య వస్తుందని కలలో కూడా ఊహించలేదని జుబేదా స్వయంగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించారు. అయితే వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని.. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఆమె త్వరగా పూర్తిగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. జుబేదా సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ చాలా యాక్టీవ్ గా ఉంటూ వస్తోంది. ముఖ్యంగా ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె చేసే వంట వీడియోలకు మామూలు రేంజ్ రీచ్ ఉండదు. అలా సోషల్ మీడియా ఆడియన్స్ కి ఈమె చాలా దగ్గరగా ఉంటోంది.
ఇక కమెడియన్ అలీ విషయానికి బాలనటుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఈయన , సుమారుగా 5 దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో కమెడియన్ గా , హీరో గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అలీ అంటే ఓక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా యుగం నడుస్తుండడం తో అలీ కి సినిమా అవకాశాలు ఒకప్పటి రేంజ్ లో రావడం లేదు. అయినప్పటికీ ఆయన స్థాయికి ప్రస్తుతం సినిమాలు అవసరం కూడా లేదు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ , పవన్ కళ్యాణ్ తో పాటు నడిచి ఉండుంటే , ఈరోజు మినిస్టర్ హోదా లో ఉండేవాడని, వైసీపీ లో చేరి బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటుంటారు. అయితే అలీ ఇప్పుడు సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ గానే ఆయన మౌళి హీరో గా నటించిన ‘దొంగ నా కొడుకు’ అనే చిత్రం లో నటించాడు.
చాలా కాలం తర్వాత మంచి బజ్ ఉన్న సినిమాలో అలీ చేస్తుండడం తో , ఈసారి ఆయన రీ ఎంట్రీ గట్టిగా వర్కౌట్ అయ్యేలాగానే అనిపిస్తోంది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలీ కి కూడా మంచి క్యారెక్టర్ పడిందని , ఈ సినిమా క్లిక్ అయితే ఆయనకు ఇకపై క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశం దక్కుతుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే నవంబర్ 13 వరకు వేచి చూడాల్సిందే.