Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli IPL Performance: అతడు మనిషి కాదు.. పరుగుల యంత్రం.. ఎవడు భయ్యా నీకు...

Virat Kohli IPL Performance: అతడు మనిషి కాదు.. పరుగుల యంత్రం.. ఎవడు భయ్యా నీకు 37 ఏళ్ల వయస్సు అన్నది..

Virat Kohli IPL Performance: ఆడుతూనే ఉన్నాడు. దశాబ్దానికి మించి బంతిని బ్యాట్ తో కసి కొద్దీ కొడుతూనే ఉన్నాడు. ఫోర్లు, సిక్సర్లు, హాఫ్ సెంచరీలు, సెంచరీలు.. ఒత్తిడిలో పరుగులు తీయడాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే అతని బ్యాటింగ్ స్టైల్ ఊహకు అందదు. ఉపమానానికి సరిపోలేదు. సాధారణంగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏ ఆటగాడయినా సరే కాస్తలో కాస్త రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోతాడు. కానీ విరాట్ కోహ్లీ అలా కాదు. అతడు పరుగుల యంత్రం.. […]

Virat Kohli IPL Performance: ఆడుతూనే ఉన్నాడు. దశాబ్దానికి మించి బంతిని బ్యాట్ తో కసి కొద్దీ కొడుతూనే ఉన్నాడు. ఫోర్లు, సిక్సర్లు, హాఫ్ సెంచరీలు, సెంచరీలు.. ఒత్తిడిలో పరుగులు తీయడాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే అతని బ్యాటింగ్ స్టైల్ ఊహకు అందదు. ఉపమానానికి సరిపోలేదు. సాధారణంగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏ ఆటగాడయినా సరే కాస్తలో కాస్త రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోతాడు. కానీ విరాట్ కోహ్లీ అలా కాదు. అతడు పరుగుల యంత్రం.. అతడిని మనిషి అనేకంటే.. రన్ మిషన్ అనవచ్చు. ఈ మాట అంటున్నది మేం కాదు. అతడికి బౌలింగ్ వేసిన వారు..

ఉదాహరణకు శుక్రవారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ సిరాజ్ నుంచి మొదలుపెడితే రషీద్ ఖాన్ వరకు ఎవరినీ వదిలిపెట్టలేదు. ఒకానొక దశలో అతడు సెంచరీ చేస్తాడేమో అని అందరూ అనుకున్నారు. హోల్డర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. అప్పటికి అతడి స్కోరు 44 బంతులలో 81 పరుగులు.. ఇందులో 8 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

గుజరాత్ జట్టు బెంగళూరు ఎదుట 206 పరుగుల టార్గెట్ విధించింది.. ఈ టార్గెట్ ఫినిష్ చేయడానికి రంగంలోకి దిగిన బెంగళూరు 24 పరుగుల వద్ద బెతల్(14) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో విరాట్ , పడికల్ (55) తో కలిసి రెండో వికెట్ కు ఏకంగా 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.. ఇది మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం మార్చేసింది.. ఇదే గుజరాత్ జట్టు నుంచి మ్యాచ్ ను బెంగళూరు వైపు మళ్ళించింది. ప్రారంభ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ వేసిన గుజరాత్ బౌలర్లు.. తర్వాత లయ తప్పారు. దీంతో బెంగళూరు జట్టు పండగ చేసుకుంది.

విరాట్ కోహ్లీ, పడిక్కల్ హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఈ మధ్యలో గుజరాత్ బౌలర్లు మళ్ళీ టచ్ లోకి వచ్చారు. పాటిదార్(8), జితేష్ శర్మ(10) ఔట్ కావడంతో బెంగళూరు జట్టు మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఈ దశలో వచ్చిన కృణాల్ పాండ్యా (23*) దుమ్ము రేపాడు. ఫలితంగా బెంగళూరు జట్టు 18.5 ఓవర్ల లోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఇదంతా కూడా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వల్లే.

విరాట్ కోహ్లీ వయసు ప్రస్తుతం 37 సంవత్సరాలు. అయినప్పటికీ అతడు పాతిక సంవత్సరాల యువకుడి లాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. అంతేకాదు ప్రస్తుత ఐపీఎల్ లో పరుగుల వరద పారిస్తూ మళ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా అవతరించాడు. ఏడు మ్యాచ్ లలో ఏడు ఇన్నింగ్స్ లలో 328 పరుగులు చేశాడు. 54.67 సగటు, 168.18 స్ట్రైక్ రేట్ తో ఈ పరుగులు చేశాడు విరాట్.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper