spot_img
Homeక్రీడలుక్రికెట్‌Rohit Sharma Playing XI Decision Update: రోహిత్ ఆడేది మ్యాచ్ ముందర తెలుస్తుందట.. ఇదేం...

Rohit Sharma Playing XI Decision Update: రోహిత్ ఆడేది మ్యాచ్ ముందర తెలుస్తుందట.. ఇదేం సస్పెన్స్ రా బాబూ

Rohit Sharma Playing XI Decision Update: సింహరాశి సినిమాలో ఓ సీన్ గుర్తుందా.. అమ్మ రాజన్న వచ్చినాడు.. పెళ్ళికొడుకు రాంబ్రహ్మం వచ్చినాడు.. ఒకసారి వచ్చి పోమ్మా మెరుపుతీగ.. అని అంటాడు మల్లికార్జున్ రావు. దానికి అతని కూతురు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. సేమ్ ఇలానే కాకపోయినా.. ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ పరిస్థితి కూడా అలానే ఉంది.

ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు డగ్ అవుట్ లో రోహిత్ శర్మ కనిపిస్తున్నాడు. తోటి ప్లేయర్లతో సరదాగా సంభాషిస్తున్నాడు. చూసేందుకు ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ మైదానంలోకి మాత్రం దిగడం లేదు. ప్రాక్టీస్ లో కనిపిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు సోషల్ మీడియాలో విడుదల చేసే వీడియోలలోనూ రోహిత్ దర్శనమిస్తున్నాడు. కానీ ఆట మాత్రం ఆటం లేదు.. ఇప్పటికే రోహిత్ నాలుగు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఈ నాలుగు మ్యాచ్ల్లో ముంబై జట్టు ఎలా ఆడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్ బాగుంటే బౌలింగ్ అద్వానంగా ఉంటుంది.. బౌలింగ్ బాగుంటే.. బ్యాటింగ్ అధ్వానంగా ఉంటుంది.. మొత్తంగా చూస్తే ఐక్యత అనేది ముంబై జట్టులో కనిపించడం లేదు. సూర్యకుమార్ నుంచి మొదలు పెడితే హార్దిక్ పాండ్యా వరకు గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ ముంబై జట్టు ఏమాత్రం ఆకట్టుకునే ప్రదర్శన ఈ సీజన్లో చేయడం లేదు…

ఆటగాళ్ల దారుణమైన ఆట తీరు నేపథ్యంలో రోహిత్ శర్మ గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది చెన్నై జట్టుతో శనివారం జరిగే మ్యాచ్లో రోహిత్ ఆడతాడని ప్రచారం జరుగుతున్నప్పటికీ చాలామంది దీనిని కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రోహిత్ ఆడతాడని అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ ఇంతవరకు రోహిత్ మైదానంలోకి అడుగుపెట్టలేదు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడలేదు.. ఇక చెన్నై జట్టుతో జరిగే మ్యాచ్లో ముంబై తరఫున రోహిత్ ఆడతాడా లేదా అనే విషయం మీద కోచ్ జయవర్ధనే క్లారిటీ ఇచ్చాడు..

“రోహిత్ గాయపడిన విషయం తెలిసిందే. అతడు తన పునరాగమనాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే తీవ్రంగా కష్టపడుతున్నాడు. వైద్య బృందం అతడిని ప్రతిరోజు పరీక్షిస్తూనే ఉంది. ఈరోజు కూడా అతడు బ్యాటింగ్ మొదలుపెట్టాడు. వైద్య బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. అతడు ఆడేది లేనిది మ్యాచ్ ముందర తెలుస్తుంది. ఇప్పటిదాకా మీరు ఓపిక పట్టండి అంటూ” జయవర్ధన వ్యాఖ్యానించాడు.. దీంతో రోహిత్ శర్మ ముంబై జట్టు తరఫున ఆడేది మరోసారి సింహరాశి సినిమాలో సన్నివేశాన్ని తలపించిందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper