spot_img
Homeబిజినెస్Best Scooters For City Riding: సిటీలో ఉండేవారు ఏ స్కూటర్ కొనాలి.. మైలేజ్, పికప్,...

Best Scooters For City Riding: సిటీలో ఉండేవారు ఏ స్కూటర్ కొనాలి.. మైలేజ్, పికప్, పవర్ కోసం ఏది ఎంచుకోవాలి..

Best Scooters For City Riding: ప్రస్తుత కాలంలో స్కూటర్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఉండేవారు సౌకర్యవంతంగా ఉండేందుకు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కొన్ని వేరియంట్లు తక్కువ ధరలో అందుబాటులో ఉండడమే కాకుండా ఎక్కువ మైలేజ్ ఇస్తున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్ లెవల్లో ఉన్న స్కూటర్ల గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. నగర ప్రజల ప్రయాణాలకు Honda Activa 110, TVS Jupiter 110, Suzuki Access 125 స్కూటర్లు బెస్ట్ మోడల్స్ గా పేర్కొంటున్నారు. ఇవి మైలేజ్, కంఫర్ట్, ధరలో సమతుల్యత ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఉన్న స్పెషల్ ఏంటో చూద్దాం..

Honda Activa 110:
Honda Activa 110 (Activa 6G) ఎక్స్-షోరూమ్ ధర రూ. 75,583 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ లో 109.51cc ఇంజన్‌ ను అమర్చారు. ఈ ఇంజన్ 7.79 bhp పవర్ అందిస్తుంది. ఇది లీటర్ ఇంధనానికి 59.5 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. స్మూత్ పెర్ఫార్మెన్స్, విశాల సర్వీస్ నెట్‌వర్క్, హై రీసేల్ వాల్యూ కలిగి ఉండడంతో దీని సేల్స్ ఎక్కువగా ఉంది. అలాగే ఇందులో సేప్టీ కోసం కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS), 5.3L ఫ్యూయల్ ట్యాంక్‌తో రోజువారీ షాపింగ్ చేసేవారికి అనుగుణంగా ఉంటుంది. ఆఫీస్ ప్రయాణాలకు కూడా ఇది కంపోర్టబుల్ గా ఉంటుంది. రెడ్ కలర్‌లో ఉండే Honda Activa 6G ఎక్కువ సేల్స్ ను కలిగి ఉంది.

TVS Jupiter 110:
TVS Jupiter 110 ధర రూ. 72,400 నుంచి రూ. 85,400 వరకు విక్రయించబడుతుంది. ఈ స్కూటర్ లో 113.3cc ఇంజన్‌ ఉండగా.. ఇది 8 PS పవర్ అందిస్తుంది. దీనిపై 48 నుంచి 62 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్, LED లైటింగ్, స్మార్ట్‌కనెక్ట్ ఫీచర్లు, మంచి స్టోరేజ్‌తో కంఫర్టబుల్ తో రైడర్లకు సౌకర్యాన్ని అందిస్తుంది. రోజుకు వేలాది అమ్మకాలు జరిగిన ఈ స్కూటర్, ఫ్యామిలీలకు బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.

Suzuki Access 125:
Suzuki Access 125 ధర రూ. 78,984 నుంచి రూ.99,278 వరకు విక్రయిస్తున్నారు. 124cc ఇంజన్‌తో 8.42 PS పవర్ అందించే ఈ స్కూటర్ లీటర్ ఇంధనానికి 45 నుంచి 64 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. బెస్ట్ పికప్, పవర్ తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ, అంపుల్ అండర్‌సీట్ స్టోరేజ్, కంఫర్టబుల్ సీటింగ్‌తో సిటీ రైడింగ్‌కు అనుగుణంగా ఉంటుంది.

పై మూడు స్కూటర్లలో వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నప్పటికీ మైలేజ్, రిలయబిలిటీ కోసం Honda Activa 110… ఫీచర్లు, స్టోరేజ్ కోసం TVS Jupiter 110.. పవర్, పికప్ కోసం Suzuki Access 125 ఎంచుకోవాలి. నగర ట్రాఫిక్‌లో సులభంగా బయటపడేందుకు మాత్రం ఈ మూడు స్కూటర్లు ఉపయోగపడుతాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Oktelugu Epaper