Mumbai Indians controversy: ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభాన్ని ముంబై ఇండియన్స్ ఘనంగా మొదలుపెట్టింది. కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ముంబై ఓపెనర్లు రికెల్టన్(81), రోహిత్ శర్మ(78) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. కోల్ కతా విధించిన 221 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19.1 ఓవర్లలో ఫినిష్ చేయడం విశేషం.
ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా ముంబై ఇండియన్స్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో 2012 తర్వాత సీజన్ తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. గత ఏడాది ప్లే ఆఫ్ కు వెళ్లిపోయినప్పటికీ కీలక దశలో ముంబై ఇండియన్స్ తీవ్రంగా తడబడింది. ఫలితంగా నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
ఆదివారం వాంఖడే మైదానంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గెలుపు వెనుక కుట్ర జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయమీడియాలో కూడా ఇదే తరహా కథనాలు ప్రసారమవుతున్నాయి. నిన్నజరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు టాస్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టాస్ వేయగానే కెమెరాకు కాయిన్ ను చూపించకుండా మరోవైపు తిప్పడం.. హార్దిక్ టాస్ గెలిచారని రిఫరీ చెప్పారు. దీంతో వివాదం మొదలయింది.
Also Read: శనివారం విరాట్.. ఆదివారం రోహిత్ శర్మ.. గౌతమ్ గంభీర్ కు ఇక మంగళవారమే..
గతంలో ముంబై ఇండియన్స్ ఇలా చేసిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పాతవీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆదివారం నాటి మ్యాచ్ లో టాస్ గెలికి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. డ్యూ లేకపోవడంతో కోల్ కతా విధించిన టార్గెట్ ను ముంబై ఈజీగా ఫినిష్ చేసింది.
ముంబై ఓపెనర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. పరుగులను సులభంగా తీశారు. కోల్ కతా బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగుల వరదపారించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఒకప్పటి వింటేజ్ హిట్ మాన్ ను చూపించాడు.