KKR vs MI: ఐపీఎల్ లో రెండో మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ లో ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబై.. రెండుసార్లు ట్రోఫీ అందుకున్న కోల్ కతా ఆదివారం ముంబై వేదికగా తలపడబోతున్నాయి.. రెండు జట్లు బలమైనవి కావడంతో పోటీ ఆసక్తికరంగా సాగుతుందని అంచనాలు ఉన్నాయి.
ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. కోల్ కతా జట్టుకు రహానే సారథ్యం వహిస్తున్నాడు. ముంబై జట్టులో హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మ.. తిలక్ వర్మ.. బుమ్రా.. వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు. వీరు గనుక రెచ్చిపోతే ముంబై జట్టుకు తిరుగు ఉండదు. ఈ మైదానంపై ప్లాట్ పిచ్ రూపొందించినట్టు వార్తలు వస్తున్నాయి. అదే గనుక నిజమైతే పరుగుల వరద పారడం ఖాయం.
ఇప్పటివరకు ఐపీఎల్లో ముంబై జట్టు 24 సార్లు కోల్ కతా మీద విజయాలు సాధించింది. కోల్ కతా 11 సార్లు ముంబై మీద విజయాలను అందుకుంది.. మొత్తంగా చూస్తే కోల్ కతా మీద ముంబైకి అప్పర్ హ్యాండ్ ఉంది. ఐపీఎల్ లో ఐదుసార్లు ట్రోఫీలు అందుకొని.. బలమైన ప్లేయర్లను కలిగి ఉన్న ముంబై జట్టు.. ఆదివారం నాటి మ్యాచ్ లో ఫేవరెట్ గా కనిపిస్తోంది. ముంబై జట్టులో సూర్య కుమార్ యాదవ్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలి ఇటువంటి వరల్డ్ కప్ లో అతడు సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అదే జోరు కోల్ కతా తో జరిగే మ్యాచ్ లో చూపిస్తాడని ముంబై అభిమానులు అంచనా వేస్తున్నారు.
కోల్ కతా జట్టులో అలెన్, గ్రీన్, సిఫర్డ్, రహానే, పావెల్, రఘు వంశీ, రమన్ దీప్ సింగ్ కీలక ప్లేయర్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా గ్రీన్, అలెన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టు తరుపున అలెన్ భీకరంగా బ్యాటింగ్ చేశాడు.. ముంబై మీద కూడా అతడు అదే జోరు కొనసాగిస్తాడని కోల్ కతా యాజమాన్యం భావిస్తోంది.
పిచ్ ప్లాట్ గా ఉంటుంది కాబట్టి పరుగులు బీభత్సంగా రావడం ఖాయం. ఒకవేళ బుమ్రా ఎక్స్ ట్రా బౌన్స్ లు వేస్తే కోల్ కతా బ్యాటర్లకు ఇబ్బంది తప్పదు. అయితే కోల్ కతా జట్టులో చాలామంది ప్లేయర్లకు బుమ్రా ను ఎదుర్కొన్న అనుభవం ఉంది. దీంతో ఆ జట్టులో ఆటగాళ్లు ఆశావాహ దృక్పథంతో కనిపిస్తున్నారు. ఈ పిచ్ మీద టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఎందుకంటే డ్యూ ఉండదు కాబట్టి చేజింగ్ ఈజీ అవుతుంది..