Homeక్రీడలుక్రికెట్‌Kavya Maran cars collection: కావ్య మారన్.. కార్ల కలెక్షన్.. ధోని కూడా మూర్చ పోతాడు

Kavya Maran cars collection: కావ్య మారన్.. కార్ల కలెక్షన్.. ధోని కూడా మూర్చ పోతాడు

Kavya Maran cars collection: మనదేశంలో ద్విచక్ర వాహనాలు, కార్ల గురించి ప్రస్తావన వస్తే అందరి నోటి నుంచి వచ్చే ఒకే ఒక మాట మహేంద్రసింగ్ ధోని. ఎందుకంటే అతడికి వాహనాలు అంటే చాలా ఇష్టం. ద్విచక్ర వాహనాలు.. కార్లను ధోని అమితంగా ఇష్టపడుతుంటాడు. వింటేజ్ కలెక్షన్ నుంచి మొదలు పెడితే నేటి మోడ్రన్ ట్రెండ్ వరకు అన్ని రకాల వాహనాలు అతని వద్ద ఉంటాయి. రాంచీలో ఆ వాహనాల కోసం అతడు ఏకంగా ఒక గ్యారేజ్ నిర్మించాడు అంటే.. అతడికి వాహనాలు అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.

మహేంద్ర సింగ్ ధోని మాత్రమే కాదు, క్రికెటర్లలో చాలామందికి వాహనాల కలెక్షన్ ఉంది. అయితే వారందరిని మించిపోయింది కావ్య మారన్.. అమాయకపు చూపులతో.. అందమైన హావభావాలతో కనిపించే కావ్య.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు యజమానిగా కొనసాగుతోంది. కావ్యకు లగ్జరీ కార్లు అంటే విపరీతమైన ఇష్టం. ఈమె గ్యారేజీలో అత్యంత ధరలో ఉన్న కార్లు కనిపిస్తూనే ఉంటాయి. ఇందులో Rolls-Royce Phantom ఉంది.. దీని ధర ఏకంగా 12.2 కోట్లు.. Bentley Bentayga అనే మోడల్ ధర ఏకంగా ఆరు కోట్ల వరకు ఉంది.. Ferrari Roma ధర 4.5 కోట్లు, BMW i7 EV కారు ధర 2.5 కోట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె దగ్గర చాలా వాహనాలు ఉన్నాయి.

ఇండియాలో ఉన్నప్పుడు ఆమె ఈ కార్లలో ప్రయాణిస్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అంతకుమించిన లగ్జరీ కార్లలో ఆమె ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఒక్కతే కూతురు కావడంతో కావ్యను అత్యంత గారాబంగా పెంచారు. అందువల్లే ఆమె ఈ స్థాయిలో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు.

కావ్య కు వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి. సన్ టీవీ నెట్వర్క్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆమె పని చేస్తున్నారు. దాదాపు ఈమె సొంత ఆస్తులే 450 కోట్ల వరకు ఉంటాయి.. అంతస్థాయిలో ఆస్తి ఉన్నప్పటికీ కావ్య డౌన్ టు ఎర్త్ అనే విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సింపుల్ లైఫ్ ను ఇష్టపడుతుంటారు.. హైదరాబాద్ జట్టు మాత్రమే కాకుండా దక్షిణాఫ్రికాలో కూడా సన్రైజర్స్ జట్టును ఆమె కొనసాగిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా లీగ్ లో ఆ జట్టు ఇటీవల ట్రోఫీ కూడా అందుకుంది.

క్రికెట్ అంటే కావ్య కు చాలా ఇష్టం. అందువల్లే ఆమె హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసింది. జట్టు విలువను అంతకంతకు పెంచుకుంది. బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ లభించే విధంగా.. హైదరాబాద్ జట్టును ఆమె రూపొందించింది. సోషల్ మీడియాలో కావ్య పెద్దగా యాక్టివ్ గా ఉండదు. కానీ హైదరాబాద్ జట్టు కార్యకలాపాల విషయంలో ఏమాత్రం రాజీపడదు. ముఖ్యంగా ఫ్యాన్స్ కోసం క్రికెటర్లతో వినూత్నమైన కార్యక్రమాలు చేయిస్తూ ఉంటుంది. అందువల్లే కావ్యను హైదరాబాద్ అభిమానులు విపరీతంగా ఇష్టపడుతుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular