Homeక్రీడలుక్రికెట్‌Kavya Maran: కావ్య మారన్ అంటే చిన్నపిల్లనుకున్నారా.. ఫైర్.. వైల్డ్ ఫైర్.. CSK అభిమానులకు దిమ్మతిరిగింది

Kavya Maran: కావ్య మారన్ అంటే చిన్నపిల్లనుకున్నారా.. ఫైర్.. వైల్డ్ ఫైర్.. CSK అభిమానులకు దిమ్మతిరిగింది

Kavya Maran: హైదరాబాద్ జట్టు యజమానిగా కావ్య మారన్ ప్రతి ఐపిఎల్ లో సృష్టించే సంచలనం మామూలుగా ఉండదు.. అభిమానులను అలరించడంలో.. ఆటగాళ్లను అభినందించడంలో ఆమె ముందు వరుసలో ఉంటుంది.. ముఖ్యంగా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆమె ఆకట్టుకుంటుంది. అందువల్లే సోషల్ మీడియాలో కావ్య కు విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. గతంలో దక్కన్ చార్జర్స్ కు కూడా గాయత్రి రెడ్డి స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండేది. ఆమె విధానంలోకి అడుగు పెడితే చాలు.. అభిమానులు కేరింతలు […]

Kavya Maran: హైదరాబాద్ జట్టు యజమానిగా కావ్య మారన్ ప్రతి ఐపిఎల్ లో సృష్టించే సంచలనం మామూలుగా ఉండదు.. అభిమానులను అలరించడంలో.. ఆటగాళ్లను అభినందించడంలో ఆమె ముందు వరుసలో ఉంటుంది.. ముఖ్యంగా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆమె ఆకట్టుకుంటుంది. అందువల్లే సోషల్ మీడియాలో కావ్య కు విపరీతమైన పాపులారిటీ ఉంటుంది.

గతంలో దక్కన్ చార్జర్స్ కు కూడా గాయత్రి రెడ్డి స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండేది. ఆమె విధానంలోకి అడుగు పెడితే చాలు.. అభిమానులు కేరింతలు కొట్టేవారు. నాటి రోజుల్లో సోషల్ మీడియా ఇంత బలంగా లేదు కాబట్టి.. గాయత్రి రెడ్డి గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఒకవేళ సోషల్ మీడియా ఈ స్థాయిలో విస్తృతంగా ఉండి ఉంటే గాయత్రి రెడ్డి కచ్చితంగా సినిమా సెలబ్రిటీ అయి ఉండేది.

గాయత్రి రెడ్డి మాదిరిగానే కావ్య హైదరాబాద్ జట్టు ప్లేయర్లను అభినందించడంలో ముందు వరుసలో ఉంటుంది. కావ్య జట్టు ఓడిపోతే బాధపడుతుంది. జట్టు ప్లేయర్లు అద్భుతంగా ఆడితే ఎగిరి గంతులు వేస్తుంది. కావ్య పలికించే హావభావాలు అందంగా ఉంటాయి. హాసిని అని హైదరాబాద్ అభిమానులు పిలుచుకుంటారు.

కావ్యకు ఆనందం వస్తే ఎగిరి గంతులు వేయడం.. బాధ కలిగితే విచారం వ్యక్తం చేయడం మాత్రమే తెలుసు. తను ఎప్పుడు కోపాన్ని వ్యక్తం చేయదు. కోపంగా ఉండదు కూడా. ఐదు తొలిసారి చెన్నై అభిమానుల మీద కావ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నై జట్టు మీద హైదరాబాద్ గెలిచిన తర్వాత ఆమె చప్పట్లు కొట్టి గట్టిగా అరిచారు. తమ జట్టు విజయాన్ని గొప్పగా ఆస్వాదించారు. ఈ నేపథ్యంలో చెన్నై అభిమానులను ఆమె వేలు పెట్టి చూపిస్తూ.. నిశ్శబ్దం అంటూ సిగ్నల్ ఇచ్చారు. కావ్య వేలుపెట్టి చెన్నై అభిమానులకు వార్నింగ్ ఇస్తున్న వీడియో ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. హైదరాబాద్ జట్టు వరుసగా రెండు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. రెండు ఓటముల తర్వాత హైదరాబాద్ జట్టు వరుసగా రెండు విజయాలు అందుకుంది. దీంతో హైదరాబాద్ అభిమానుల్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈసారి తమ జట్టు ట్రోఫీ గెలుస్తుందని హైదరాబాద్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper