Homeఎంటర్టైన్మెంట్Anirudh- Kavya Maran: టాలీవుడ్ ని అవమానించిన అనిరుద్ -కావ్య మారన్..ఇంత చులకన ఎందుకు?

Anirudh- Kavya Maran: టాలీవుడ్ ని అవమానించిన అనిరుద్ -కావ్య మారన్..ఇంత చులకన ఎందుకు?

Anirudh- Kavya Maran: వచ్చే నెల 10 , 11 తేదీలలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ , కావ్య మారన్ పెళ్లి వేడుకలు గ్రీస్ లో అంగరంగ వైభవంగా జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఇప్పుడు వీళ్లిద్దరి పెళ్లి గురించే చర్చ. గత రెండు మూడేళ్ళ నుండి వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా అన్నాక ఇలాంటి రూమర్స్ సర్వ సాధారణమే కదా […]

Anirudh- Kavya Maran: వచ్చే నెల 10 , 11 తేదీలలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ , కావ్య మారన్ పెళ్లి వేడుకలు గ్రీస్ లో అంగరంగ వైభవంగా జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఇప్పుడు వీళ్లిద్దరి పెళ్లి గురించే చర్చ. గత రెండు మూడేళ్ళ నుండి వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా అన్నాక ఇలాంటి రూమర్స్ సర్వ సాధారణమే కదా , పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే వీళ్లిద్దరు నిజంగా పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారిక ప్రకటన రావడం తో , అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇకపోతే వీళ్ళ పెళ్ళికి సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చే అవకాశం లేదు , కేవలం కుటుంబ సభ్యుల సమక్షం లో జరగనుంది. కానీ నవంబర్ 21 న జరగబోయే వెడ్డింగ్ రిసెప్షన్ కి మాత్రం అందరూ హాజరు కాబోతున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, అనిరుద్ మేనమామ సూపర్ స్టార్ రజినీకాంత్ , అజిత్ , సూర్య వంటి వారు ఈ పెళ్ళికి హాజరు కాబోతున్నారు. మన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కూడా ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక అందించారు. ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అనిరుద్ , కావ్య దంపతులు టాలీవుడ్ హీరోలను, హీరోయిన్లను చాలా ఘోరంగా అవమానించారు అనే చెప్పాలి. వీళ్ళ పెళ్ళికి కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే ఆహ్వానం దక్కింది. మిగిలిన టాలీవుడ్ ప్రముఖులకు ఎవ్వరికీ కూడా ఆహ్వానం దక్కలేదనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అనిరుద్ ఇప్పటి వరకు అల్లు అర్జున్ తో కలిసి ఒక్క సినిమా కూడా పని చేయలేదు. అయినప్పటికీ కూడా ఆయనకు ఎందుకు అంతటి ప్రాధాన్యత ఇచ్చారో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఆయన టాలీవుడ్ లో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నాని వంటి హీరోల సినిమాలకు పని చేసాడు , అయినప్పటికీ కూడా వాళ్లకు ఆహ్వానం అందించలేదు. పవన్ కళ్యాణ్ తో కలిసి ‘ఆజ్ఞాతివాసీ’ సినిమా చేసాడు , ప్రస్తుతం ఆయన మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు, అయినప్పటికీ కనీసం ప్రోటోకాల్ క్రింద కూడా ఆయనకు ఆహ్వానం అందించకపోవడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఫైర్ మీద ఉన్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు అంటే అంత చులకన గా కనిపిస్తున్నారా ?, ఎందుకు ఆహ్వానించలేదు అంటూ నిలదీస్తున్నారు. పైగా కావ్య మారన్ తెలుగు వాళ్ళ ఎమోషన్ కి చాలా దగ్గరైన అమ్మాయి. ఎందుకంటే ఆమె సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీం కి ఓనర్ కాబట్టి. అయినప్పటికీ కూడా ఆమె మన తెలుగు సినీ సెలబ్రిటీలను గౌరవించలేదని అంటున్నారు నెటిజెన్స్. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper