Homeక్రీడలుక్రికెట్‌Jahanara Alam: పీరియడ్స్ ఎప్పుడు? వాడు కోచ్ కాదు.. ఆ మహిళా క్రికెటర్ కు ఎంతటి...

Jahanara Alam: పీరియడ్స్ ఎప్పుడు? వాడు కోచ్ కాదు.. ఆ మహిళా క్రికెటర్ కు ఎంతటి నరకమంటే?

Jahanara Alam: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ ఆటలో ప్లేయర్ల మధ్య పోటీ ఉండాలి.. ఆ ఆట ఆడే ప్లేయర్లకు ప్రతిభ ఆధారంగా అవకాశాలు లభించాలి. ఇవన్నీ కూడా క్రమ పద్ధతిలో జరిగినప్పుడే చూసే ప్రేక్షకులకు ఆనందం.. ఆడే ఆటగాళ్లకు ఉత్సాహం. ఇందులో ఏ ఒక్కటి లయ తప్పినా పరిస్థితి మారిపోతుంది. క్రికెట్ ఆటకు అర్థం మారిపోతుంది..

Also Read: ‘పెద్ది’ సినిమాకు జాన్వీ కపూర్ పెద్ద మైనస్ కానుందా..? హీరోయిన్ ని చూపించే విధానం అదేనా

క్రికెట్ లో ప్రతిభ ఆధారంగానే ప్లేయర్లకు అవకాశాలు లభించాలి. అలాకాకుండా ప్లేయర్ల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి ఏదో ఆశించి అవకాశాలు ఇస్తే మాత్రం ఆ తర్వాత జరిగే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళ ప్లేయర్లకు అవకాశాలు ఇచ్చే విషయంలో కొంతమంది కోచ్ లు దారుణంగా వ్యవహరిస్తుంటారు. ఆ ప్లేయర్లను వేరే విధంగా చూస్తుంటారు. పైగా కామపిశాచుల మాదిరిగా ప్రవర్తిస్తుంటారు. అటువంటి కోచ్ లు చూపించే పైశాచికాన్ని తట్టుకోలేక చాలామంది ప్లేయర్లు క్రికెట్ నుంచి దూరం జరిగారు.. కొంతమంది అవన్నీ తట్టుకొని నిలబడ్డారు. ఆ అన్యాయాలను అడిగే దమ్ము లేక సోషల్ మీడియా వేదికలలో బయటపెట్టారు. అలా ఓ ప్లేయర్ ఓ కోచ్ కామస్వరూపాన్ని బయటపెట్టింది. తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది.

ఆ ప్లేయర్ పేరు జహనారా ఆలం.. బంగ్లాదేశ్ మహిళా జట్టులో క్రికెటర్. ఈమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.. జహనారా ను కోచ్ మంజూరుల్ ఇస్లాం 2022 వరల్డ్ కప్ ప్రాక్టీస్ సమయంలో పదే పదే వేధించే వాడు. ఆమె భుజాల మీద చేతులు వేసి ఇబ్బంది పెట్టేవాడు. పీరియడ్స్ డేట్ ఏంటి అని అడిగేవాడు. ఇదంతా ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నిస్తే.. నేను రెడీ కావాలి కదా అని ఆమెకు సమాధానం చెప్పేవాడు. అతడు అడిగిన ప్రతి దానికి జహనారా నో చెప్పింది. దీంతో ఆమె కెరియర్ మొత్తాన్ని ఇస్లాం అడ్డుకున్నాడు. అంతేకాదు ఆమెను తీవ్రంగా ఇబ్బంది కూడా పెట్టాడు.. ఇన్నాళ్లకు అతడి ఆగడాలను ఆమె బయట పెట్టింది. కేవలం జహనారా మాత్రమే కాకుండా.. చాలామంది బంగ్లా ప్లేయర్లు ఇస్లాం వల్ల ఇబ్బంది పడ్డారని అక్కడ మీడియా చెబుతోంది. జహనారా వీడియో విడుదల చేసిన తర్వాత అక్కడ పరిస్థితులు ఒకసారిగా మారిపోయాయి. మరి దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular