Janhvi Kapoor: హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అని అనిపించే రేంజ్ అందం ఎవరికైనా ఉందా అంటే అది శ్రీదేవి కి మాత్రమే ఉంది. ఇప్పటి తరం హీరోలను కూడా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడిగితే శ్రీదేవి పేరే చెప్తుంటారు. కేవలం అందం లోనే కాదు,నటనలో కూడా శ్రీదేవి రూటే సపరేట్. ఎలాంటి రోల్ లో అయినా ఆమె జీవించగలదు. అలాంటి హీరోయిన్ కూతురు గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్(Jhanvi Kapoor). బాలీవుడ్ లో ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ అవ్వలేదు. కానీ తెలుగు ఆడియన్స్ ఈమెని ‘దేవర’ చిత్రం ద్వారా ఆదరించారు. ‘దేవర’ మూవీ సక్సెస్ క్రెడిట్ లో జాన్వీ కపూర్ క్రెడిట్ కూడా ఎంతో కొంత ఉంది. ఎందుకంటే ఆ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటలో జాన్వీ అందాలను చూసి ఫిదా అవ్వని కుర్రాడు అంటూ ఎవ్వరూ ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: రాజమౌళి మామూలోడు కదబ్బా…పృథ్వీ రాజ్ లుక్ ను ఆ యానిమేటేడ్ టీవీ సీరియల్ నుంచి కాపీ చేశాడా..?
‘దేవర’ తర్వాత ఈమె తెలుగు లో చేస్తున్న రెండవ చిత్రం ‘పెద్ది'(Peddi Movie). రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. అయితే నేడు ఈ చిత్రం నుండి ‘చికిరి..చికిరి’ పాట విడుదలైంది. ఈ పాటలో రామ్ చరణ్ డ్యాన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ, ఇందులో జాన్వీ కపూర్ లుక్ మాత్రం ఆడియన్స్ కి అంతగా నటించలేదు. అసలు జాన్వీ కపూర్ ఈ చిత్రం లో హీరోయిన్ లాగానే కనిపించడం లేదని, వ్యాంప్ క్యారక్టర్ చేసే అమ్మాయి లాగా కనిపిస్తోందని, దేవర చిత్రం లో కూడా ఆమె గెటప్ అలాగే ఉన్నింది అని, చూసేందుకు బాగానే ఉన్నప్పటికీ, ఎందుకో హీరోయిన్ ఫీలింగ్ కలగడం లేదని, ఐటెం సాంగ్స్ లోకి వచ్చే హీరోయిన్ లాగా ఉందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.
దీంతో ఇప్పుడు ‘పెద్ది’ చిత్రానికి జాన్వీ కపూర్ ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అనే భయం ఫ్యాన్స్ లో కలుగుతుంది. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ఇందులో జాన్వీ కపూర్ క్యారక్టర్ కి తగ్గ గెటప్ వేసిందని, అందుకే అలా రెబెల్ గా కనిపిస్తుందని, ఇందులో ఆమెది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అని అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం అవుతుందో తెలియదు కానీ, ప్రస్తుతానికి అయితే జాన్వీ కపూర్ పెద్ది కి పెద్ద మైనస్ అనే ప్రచారం సోషల్ మీడియా లో బలంగా జరుగుతోంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.