Baahubali The Epic First Week Collection: ఇది వరకు మన టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ కల్ట్ క్లాసిక్ చిత్రాలు రీ రిలీజ్ అయ్యి సెన్సేషన్ సృష్టించాయి. కానీ ఎంత గొప్ప రీ రిలీజ్ అయినా కేవలం ఒక్క రోజు, లేదంటే వీకెండ్ వరకు థియేటర్స్ లో రన్ అయ్యి వెళ్లడం మాత్రమే మనం చూసాము. కానీ ‘బాహుబలి : ది ఎపిక్'(Bahubali: The Epic) రిలీజ్ అయ్యాక లెక్కలు మొత్తం మారిపోయాయి. రెండు భాగాలను కలిపి ‘బాహుబలి : ది ఎపిక్’ గా రీసెంట్ గానే రీ రిలీజ్ చేశారు. మొదటి రోజు సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఇప్పటికీ డీసెంట్ స్థాయి థియేట్రికల్ రన్ తో ముందుకు దూసుకుపోతోంది. ఇలా హిస్టరీ లో ఒక రీ రిలీజ్ సినిమాకు లాంగ్ రన్ రావడం అనేది ఎప్పుడూ జరగలేదు. దీన్ని బట్టీ ఈ సినిమా కి ఆడియన్స్ లో ఇంకా చెక్కు చెదరలేదు అనేది స్పష్టంగా తెలుస్త్రుంది.
Also Read: ‘పెద్ది’ సినిమాకు జాన్వీ కపూర్ పెద్ద మైనస్ కానుందా..? హీరోయిన్ ని చూపించే విధానం అదేనా!
విడుదలై వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 7వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 63 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, వరల్డ్ వైడ్ గా కోటి 23 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ప్రభాస్ గత రీ రిలీజ్ సినిమాలు మొదటి రోజు కూడా ఇంతటి గ్రాస్ వసూళ్లను రాబట్టలేదు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మొదటి వారం 21 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటకలో 4 కోట్ల 50 లక్షలు, తమిళనాడు + కేరళ లో 3 కోట్ల 45 లక్షలు, హిందీ+ రెస్ట్ ఆఫ్ ఇండియా లో 7 కోట్ల 60 లక్షలు, ఓవర్సీస్ లో 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా చూస్తే నైజాం ప్రాంతం నుండి 10 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, సీడెడ్ నుండి 2 కోట్ల 30 లక్షలు,ఆంధ్ర ప్రదేశ్ నుండి 8 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రికార్డు ని రాబోయే రోజుల్లో ఎవరు కొట్టబోతున్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే మొదటి రోజు రికార్డు వరకు కొట్టొచ్చు. కానీ ఈ రేంజ్ లాంగ్ రన్ మాత్రం అసాధ్యం అనే చెప్పాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేతిలో అత్తారింటికి దారేది, బద్రి మరియు ఓజీ చిత్రాలు ఉన్నాయి. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ చేతుల్లో దూకుడు, పోకిరి చిత్రాలు మాత్రమే మిగిలాయి. చూడాలి మరి ఈ రికార్డు ని ఎవరు అందుకోబోతున్నారు అనేది.