Mumbai Indians Win The IPL 2022: ఐపీఎల్ లో బలమైన టీంగా పేరుపొందిన ముంబై ఇండియన్స్ ఈ మారు కష్టాలే ఎదుర్కోనుంది. అయిదు సార్లు కప్ గెలిచిన జోష్ లో ఉన్నా ఈ సారి మాత్రం విజయాలు ఈ జట్టుకు కలిసి రావనే సందేహం అందరిలో వస్తోంది. దీనికి కారణం జట్టు కూర్పులో బలం లేకపోవడమే. ఇన్నాళ్లు జట్టు పటిష్టంగా ఉండటంతో వరుస విజయాలు అందుకుంటూ అప్రతిహ విజయయాత్ర కొనసాగించింది. కానీ ఈ మారు అదంత సులభం కాదని తేలిపోతోంది.

దీనికి కారణం జట్టు పరిస్థితే. గతంలో ఉన్న ఫామ్ ఇప్పటి ఆటగాళ్లలో కనిపించడం లేదు. ఫలితంగా త్వరలో జరగబోయే ఐపీఎల్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆటగాళ్ల బలహీనత ప్రత్యర్థి జట్టుకు ప్లస్ కానుందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇన్నాళ్లు గెలిచినా ఇప్పుడు మాత్రం ఆ సత్తా లేదనే విషయం బోధపడుతోంది.
Also Read: Anasuya Bharadwaj Tweet: ట్రోలర్స్ కి షాకిచ్చేలా ట్వీట్ చేసిన అనసూయ
ఈసారి జరిగిన మెగా వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోయింది. ఫామ్ లో లేని ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడంతో జట్టు పేలవంగా తయారయింది. దీంతో ఐపీఎల్ లో విజయాలు సాధించడం అంత సులభం కాదని తేలిపోతోంది. అయినప్పటికీ పోటీలో ఉన్నా అద్భుత ప్రదర్శన ఆశించడం అత్యాశే అవుతుంది.
అనుభవ లేమి ఆటగాళ్లతో జట్టు పరిస్థితి అధ్వానంగా కనిపిస్తోంది. బుమ్రాకు తోడుగా మరో బ్యాటర్ అందుబాటులో ఉండటం లేదు. మిడిలార్డర్ కూడా బలహీనంగానే కనిపిస్తోంది. ఇషాన్ కిషన్ ఓపెనర్ గా దిగినా అద్బుత ప్రదర్శన మాత్రం ఉత్తిత్తి మాటే కావొచ్చనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మపైనే జట్టు ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Shane Warne: షేన్ వార్న్ తీసుకున్న నిర్ణయమే అతని మృతికి కారణమైందా..?