spot_img
Homeక్రీడలుక్రికెట్‌Ind Vs Aus 2nd Test: పుట్టినరోజు నాడు బుమ్రా కు కొంచెం తీపి.. మరి...

Ind Vs Aus 2nd Test: పుట్టినరోజు నాడు బుమ్రా కు కొంచెం తీపి.. మరి కొంచెం చేదు..

Ind Vs Aus 2nd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో రెండవ టెస్ట్ ఆడుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 180 పరుగులకు కుప్పకూలింది. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులతో హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 37, గిల్ 31, అశ్విన్ 22, 21 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. కోహ్లీ 7, రోహిత్ 3 పరుగులకు ఔటై అభిమానుల అంచనాలను అందుకోలేకపోయారు. ఓపెన్ యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా 0 పరుగులకే అవుట్ అయ్యారు.

కొంచెం తీపి కొంచెం చేదు..

బుమ్రా (డిసెంబర్ 6) శుక్రవారం 31 వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ఖవాజా ను అవుట్ చేయడం ద్వారా 2024లో టెస్ట్ క్రికెట్లో 50 వికెట్లు సాధించిన బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఇదే దశలో పుట్టినరోజు నాడు డక్ అవుట్ అయిన ఆటగాడిగా చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. 1978 భారత జట్టు వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఆ మ్యాచ్ లో భారత ఆటగాడు సయ్యద్ కీర్మాణి డక్ అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ జట్టుతో 1996లో జరిగిన మ్యాచ్లో టీమిండి ఆటగాడు వెంకటపతి రాజు సున్నా పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో 2018 లో జరిగిన మ్యాచ్లో భారత ఆటగాడు ఇశాంత్ శర్మ తన పుట్టినరోజు నాడు డక్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు వీరి సరసనే బుమ్రా చేరిపోయాడు. దీంతో పుట్టినరోజు నాడు 50 వికెట్ల క్లబ్లో చేరిన విషయం తీపిని పంచగా.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సున్నా పరుగులకు అవుట్ కావడం బుమ్రా కు చేదు ఫలితాన్ని ఇచ్చింది. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో బుమ్రా 8 బంతులు ఎదుర్కొన్నాడు. ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. కమిన్స్ బౌలింగ్లో ఉస్మాన్ ఖవాజాకు క్యాచ్ ఇచ్చి బుమ్రా అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను అవుట్ చేసి 2024 లో టెస్ట్ క్రికెట్లో 50 వికెట్లు సాధించిన బౌలర్ గా బుమ్రా ఆవిర్భవించాడు. కాగా, పెర్త్ ఓటమి నుంచి త్వరగానే కోలుకున్న ఆతిధ్య ఆస్ట్రేలియా.. అడిలైడ్ టెస్టులో భారత జట్టుపై తొలి రోజు పై చేయి సాధించింది. ముందుగా బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీం ఇండియాను 180 పరుగులకు కుప్ప కూల్చిన ఆస్ట్రేలియా జట్టు.. తర్వాత ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో లబూషేన్(20), మెక్ స్వీని(38) ఉన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Pooja Hegde

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Meher Ramesh Family Tragedy

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Kiran Abbavaram

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...
Balakrishna Injury

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Oktelugu Epaper