India Cricketers: లెక్కలేసుకుని తినాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీర సామర్థ్యాన్ని కాపాడుకోవాలి. జట్టు ఫిజియో చెప్పినట్టు నడుచుకోవాలి. జట్టు కోచ్ విధించిన నిబంధనలను పాటించాలి. తేడా వస్తే జట్టులో స్థానం ఉండదు. అందువల్లే క్రికెటర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. తినే తిండి విషయంలో అయితే లెక్కలు వేసుకుంటారు. శరీర సామర్థ్యాన్ని కాపాడుకునే విషయంలో చాలా వరకు త్యాగాలు చేస్తూ ఉంటారు. ఒక ముక్కలో చెప్పాలంటే నోటికి నిత్యం తాళం వేసుకొని ఉంటారు.
ఎడారిలో వర్షం పడినట్టు.. కరువు నేలలో గంగమ్మ ప్రవహించినట్టు.. అప్పుడప్పుడు క్రికెటర్లకు అరుదైన అవకాశం లభిస్తూ ఉంటుంది. నచ్చినట్టుగా ఉండడం.. మెచ్చినట్టు తినడం వంటి సౌలభ్యం లభిస్తూ ఉంటుంది. అప్పుడు వచ్చిన అవకాశాన్ని క్రికెటర్లు ఏమాత్రం వదులుకోలేరు. ఈ జన్మమె రుచి చూడడానికి దొరికేరా అన్నట్టుగా పాటలు పాడుకుంటూ తినేస్తూ ఉంటారు. ఇష్టమైన ఆహారాన్ని.. పొట్టలోకి తోస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆకాశంలో ఎగిరేటివి.. నీళ్లలో ఇదేటివి.. భూమ్మీద నడిచేటివి.. ఇలా సమస్త జీవరాశి వారి ప్లేట్లలో ఉంటుంది.
ఇప్పుడు ఇదే రకమైన ఫుడ్ ఫెస్టివల్ ను ఎంజాయ్ చేశారు టీమ్ ఇండియా క్రికెటర్లు. వాషింగ్టన్ సుందర్.. సాయి సుదర్శన్.. తిలక్ వర్మ లాంటి ప్లేయర్లు ప్రస్తుతం బెంగళూరులో బీసీసీఐ క్రికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ సెంటర్లో శిక్షణ పొందుతున్నారు. కొంతకాలంగా వారు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. అందువల్లే శ్రీలంక సిరీస్ కి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో శిక్షణ పొందిన తర్వాత వారికి కాస్త సమయం దొరికింది. ఇంకేముంది బెంగళూరులో నచ్చిన ఫుడ్ ఐటమ్స్ మొత్తం తెప్పించుకున్నారు. దొన్నే బిర్యాని నుంచి మొదలు పెడితే రాగి సంగటి వరకు.. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మొత్తాన్ని టేస్ట్ చేశారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత అసలు సిసలైన ఫుడ్ తిని.. తమ జిహ్వను సంతృప్తి పరచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో రచ్చ లేపుతోంది. అభిమానులకు ఫుడ్ కిక్ ఇస్తోంది.
నచ్చిన ఫుడ్ తిన్నారు. ఆ వాతావరణాన్ని ఆస్వాదించారు. ఇంతకంటే క్రికెటర్లకు కావాల్సింది ఏముంది. మొత్తానికి ఉపవాసం విడిచిన భక్తుల మాదిరిగా క్రికెటర్ల వ్యవహరించారు. సమయం దొరికింది. అనుకూలమైన వాతావరణం ఉంది. ఇంకేముంది కుమ్మేశారు.. టీమిండియా క్రికెటర్లు పండగ చేసుకున్నారని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
Washington Sundar, Sai Sudharsan, and Varun Chakravarthy enjoying biryani together at Akshay Food Factory in Bengaluru.
All three players are currently at the COE in Bengaluru, recovering from their injuries. pic.twitter.com/IbyTSlCzB0
— Sonu (@Cricket_live247) August 18, 2026