Homeక్రీడలుక్రికెట్‌India Vs Afghanistan Test Match History: ఆఫ్ఘనిస్తాన్ మీద ఊహించిందే.. కానీ ఇది టీమిండియా...

India Vs Afghanistan Test Match History: ఆఫ్ఘనిస్తాన్ మీద ఊహించిందే.. కానీ ఇది టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేది

India Vs Afghanistan Test Match History: టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏకంగా 300 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. తద్వారా దక్షిణాఫ్రికా.. అంతకుముందు న్యూజిలాండ్ జట్లతో ఎదురైన దారుణ ఓటముల నుంచి సాంత్వన పొందింది. డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో ఉన్న టీమిండియా కు ఈ విజయం ఒక రకంగా రిలీఫ్ ఇచ్చింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో టి20 సిరీస్ ల […]

India Vs Afghanistan Test Match History: టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏకంగా 300 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. తద్వారా దక్షిణాఫ్రికా.. అంతకుముందు న్యూజిలాండ్ జట్లతో ఎదురైన దారుణ ఓటముల నుంచి సాంత్వన పొందింది. డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో ఉన్న టీమిండియా కు ఈ విజయం ఒక రకంగా రిలీఫ్ ఇచ్చింది.

ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో టి20 సిరీస్ ల తర్వాత టీమిండియా శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో టెస్ట్ సిరీస్ లు ఆడుతుంది. ఆ సిరీస్ లలో టీమిండియా ఇలానే ఆడితే.. కచ్చితంగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానాన్ని అందిపుచ్చుకుంటుంది. గతంలో రెండుసార్లు టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ వెళ్ళింది. రెండుసార్లు కూడా ఓటమిపాలైంది. అయితే ఈసారి టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా.. అంతకు ముందు న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటములను మర్చిపోయి.. వరుసగా విజయాలు సాధించాలని బలమైన నమ్మకంతో ఉంది.

ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 300 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. ఈ గెలుపు టీం ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్దది.. ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలుపొందింది. 2018లో వెస్టిండీస్ జట్టుతో రాజ్ కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో 272 పరుగులు తేడాతో విజయాన్ని అందుకుంది. 2018లో బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 262 పరుగుల తేడాతో గెలిచింది. 2007లో మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత్ 239 పరుగుల తేడాతో గెలిచింది 2017లో నాగపూర్ వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 239 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయాలు మొత్తం భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవడం విశేషం.

టీమిండియా ఈ గెలుపును ఇక్కడితోనే ఆపివేయొద్దని అభిమానులు కోరుకుంటున్నారు. వచ్చే మ్యాచ్లో కూడా ఇదే స్థాయిలో జోరు చూపించాలని ఆశిస్తున్నారు. టీమిండియాలో మెరుగైన ప్లేయర్ లు ఉన్నారని.. వారంతా అద్భుతంగా ఆడితే తిరుగు ఉండదని చెబుతున్నారు. గిల్ నాయకత్వంలో టీమిండియా డబ్ల్యూటీసి ఫైనల్ ట్రోఫీ సాధించాలని కోరుకుంటున్నారు. టీమిండియా ఈ విజయంతోనే ఆగిపోతుందా.. వచ్చే సిరీస్లలో కూడా అదరగొడుతుందా.. చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper