Homeక్రీడలుక్రికెట్‌India A Vs Sri Lanka A: ఇండియా ఏ వర్సెస్ శ్రీలంక ఏ :...

India A Vs Sri Lanka A: ఇండియా ఏ వర్సెస్ శ్రీలంక ఏ : ఏం మ్యాచ్ మామ.. డ్రా అయిపోయింది.. నరాలు కట్ అయ్యాయి అంతే..

India A Vs Sri Lanka A: మామూలు ఉత్కంఠ కాదు.. బంతి బంతికి సమీకరణం మారిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు క్రికెట్ మజా లభించింది. రెండు జట్ల ఆటగాళ్లు విజయం కోసం చివరి వరకు పోరాడారు. తమ శాయశక్తులా కృషి చేశారు. శ్రీలంక వేదికగా ఆఫ్ఘనిస్తాన్, భారత్, శ్రీలంక జట్ల మధ్య ట్రై సిరీస్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఏ, శ్రీలంక ఏ జట్లు తలపడుతున్నాయి. దంబుల్లా వేదికగా […]

India A Vs Sri Lanka A: మామూలు ఉత్కంఠ కాదు.. బంతి బంతికి సమీకరణం మారిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు క్రికెట్ మజా లభించింది. రెండు జట్ల ఆటగాళ్లు విజయం కోసం చివరి వరకు పోరాడారు. తమ శాయశక్తులా కృషి చేశారు.

శ్రీలంక వేదికగా ఆఫ్ఘనిస్తాన్, భారత్, శ్రీలంక జట్ల మధ్య ట్రై సిరీస్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఏ, శ్రీలంక ఏ జట్లు తలపడుతున్నాయి. దంబుల్లా వేదికగా సోమవారం ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్, శ్రీలంక సమానంగా పరుగులు చేశాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ జట్టు 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసింది. భారత జట్టులో సూర్యాంష్ (72), విప్రజ్ నిగం (51), రుతురాజు (37), తిలక్ వర్మ (23), వైభవ్ సూర్య వంశీ (21) పరుగులు చేశారు. శ్రీలంక జట్టులో మహమ్మద్ షిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. విజయ్ కాంత్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు.

అనంతరం శ్రీలంక జట్టు చేజింగ్ మొదలుపెట్టింది.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. శ్రీలంక జట్టులో సాధీర 93 పరుగులు చేశాడు. ఓపెనర్ నిరోషన్ 37 పరుగులు చేశాడు. రెండు జట్ల పరుగులు సమానం కావడంతో సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్ లో శ్రీలంక ముందుగా బ్యాటింగ్ చేసింది.

తొలి బంతికి రెండు పరుగులు, రెండవ బంతికి ఒక పరుగు, మూడవ బంతికి ఒక పరుగు, నాలుగో బంతికి మూడు పరుగులు, ఐదో బంతికి సిక్సర్, ఆరో బంతి నోబాల్.. మరో బంతికి బై రూపంలో ఒక పరుగు వచ్చింది. మొత్తంగా 17 పరుగులు శ్రీలంక జట్టు చేసింది.

ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ మొదలు పెట్టింది. తొలి బంతికి రెండు పరుగులు.. రెండవ బంతికి పరుగు రాలేదు.. మూడోవంతుకి ఒక పరుగు.. నాలుగు బంతికి రెండు పరుగులు.. ఐదో బంతికి ఫోర్.. ఆరో బంతికి ఒక పరుగు కూడా రాలేదు. టీ మీడియా కేవలం సూపర్ ఓవర్లో 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో శ్రీలంక జట్టు గెలుపును అందుకుంది. ఈ మ్యాచ్ సాగిన విధానం అభిమానులకు సరికొత్త క్రికెట్ ఆనందాన్ని అందించింది.

ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో శ్రీలంక మీద ఇండియా విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయింది. శ్రీలంక చేతిలో సూపర్ ఓవర్ లో ఓడిపోయింది. ఈ సిరీస్ లో టీమిండియా మూడు మ్యాచ్ లు ఆడింది. ఒక విజయం నమోదు చేసింది. రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. రెండు పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక మూడు మ్యాచ్ లలో.. రెండు విజయాలు నమోదు చేసింది. నాలుగు పాయింట్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper