Homeక్రీడలుICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్: అటు బౌలింగ్ లో.. ఇటు బ్యాటింగ్ లో...

ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్: అటు బౌలింగ్ లో.. ఇటు బ్యాటింగ్ లో మనోళ్లే నెంబర్ 1.. ఎవరంటే…

ఇండియా ప్రస్తుతం వన్డే ప్రపంచ కప్ లో భాగంగా మరొకసారి తన సత్తా చాటుతూ ప్రపంచ దేశాల మీద పోరాటం చేస్తుందనే చెప్పాలి. ఇక ఇండియా ఇప్పటికే వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కి చేరుకోగా, ఇండియాతో తలబడే టీమ్ ఏది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ICC ODI Rankings: ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే ఇప్పుడు పెకిలించడానికి వీలులేని ఒక మహా వృక్షం గా తయారైంది.మొక్క నైతే పీకేయచ్చు కానీ కొన్ని కొమ్మల సమ్మేళనం తో నిర్మించుకున్న వృక్షాన్ని ఎలా పెకిలిస్తాం…ఇక ఇండియన్ క్రికెట్ టీమ్ క్రికెట్ అనే ఆయుధం తో దేశాల మీద దండయాత్ర మొదలు పెట్టింది.పోటి కి దిగిన ప్రతి టీమ్ మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వాళ్ల ను ఓడించి మనం గెలవడానికి ఇండియన్ టీమ్ చేస్తున్న పోరాటం….ఇక ఇండియన్ క్రికెట్ హిస్టరీ లో మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్లేయర్లు వరుసగా రికార్డ్ లను క్రియేట్ చేస్తున్నారు.ఇక బ్యాట్స్ మెన్స్ బ్యాట్ తో సత్తా చూపిస్తూనే, ప్లేయర్లు బాల్ తో మ్యాజిక్ లు చేసి ప్రపంచం లో నెంబర్ వన్ బౌలర్లు గా గుర్తింపు పొందుతున్నారు.ఇక మన ప్లేయర్లని ఎదుర్కొని నిలబడాలి అంటే అవతలి టీమ్ ఏదైనా సరే వాళ్లలో దమ్ము ఉండాలి అని గొప్పగా చెప్పుకునే స్థాయి లో ఇండియన్ టీమ్ విజృంభిస్తుంది…

ఇక ఇండియా ప్రస్తుతం వన్డే ప్రపంచ కప్ లో భాగంగా మరొకసారి తన సత్తా చాటుతూ ప్రపంచ దేశాల మీద పోరాటం చేస్తుందనే చెప్పాలి. ఇక ఇండియా ఇప్పటికే వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కి చేరుకోగా, ఇండియాతో తలబడే టీమ్ ఏది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ క్రమంలో ఇండియన్ ప్లేయర్లు అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తున్నందుకుగాను ర్యాంకింగ్స్ లో మెరుగైన స్థానాలను సంపాదించుకున్నారు…ఇక టాప్ 10 లో కొనసాగుతున్న మన ప్లేయర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…

ఇక ఇండియన్ టీమ్ ఓపెనర్ ప్లేయర్ అయిన శుభ్ మన్ గిల్ వన్డేల్లో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్నాడు.ఇక ఇంతకు ముందు పాకిస్థాన్ ప్లేయర్ అయిన బాబర్ అజమ్ నెంబర్ వన్ స్థానం లో ఉండేవాడు. కానీ ఇప్పుడు వరల్డ్ కప్ లో గిల్ చాలా మంచి బ్యాటింగ్ తో రాణిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రస్తుతం నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్నాడు…ఇక మన బ్యాట్స్ మెన్స్ లలో కోహ్లీ నాల్గోవ స్థానాన్ని దక్కించుకోగా, మన కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మాత్రం ఆరోవ పొజిషన్ లో కొనసాగుతున్నాడు…

ఇక ఇలాంటి టైం లో ఇండియన్ టీమ్ బ్యాట్స్ మెన్స్ అనే కాదు ఇండియన్ టీమ్ అభిమానులు కూడా చాలా సంతోషపడుతున్నారు.ఇక బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లో కూడా మన ప్లేయర్లు వాళ్ల సత్తా చాటుకున్నారు…మన పేస్ బౌలర్ అయిన మహమ్మద్ సిరాజ్ నెంబర్ వన్ స్థానం లో కొనసాగగా,ఇక మన స్పిన్ దిగ్గజం అయిన కుల్దిప్ యాదవ్ 4 వ స్థానం లో, జస్ప్రిత్ బుమ్ర 8 వ స్థానం లో, మహమ్మద్ షమీ 10 వ స్థానంలో కొనసాగుతున్నారు…ఇలా ఇండియన్ టీమ్ అన్ని విభాగాల్లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది…ఇక ఈ వరల్డ్ కప్ లో ఎలాగైనా కప్పు గెలవాలని ఇండియన్ టీమ్ చూస్తున్నట్టు గా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper