Homeక్రీడలుక్రికెట్‌Hardik Pandya Mahika Sharma: గర్ల్ ఫ్రెండ్ తో హార్థిక్ పాండ్యా పెళ్లి.. ఈ ట్విస్ట్...

Hardik Pandya Mahika Sharma: గర్ల్ ఫ్రెండ్ తో హార్థిక్ పాండ్యా పెళ్లి.. ఈ ట్విస్ట్ ఊహించలేదుగా

Hardik Pandya Mahika Sharma: ముంబై ఇండియన్స్ సారధిగా హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు. వరుసగా మూడు సీజన్లలో తన స్థాయి ఆట తీరు కొనసాగించలేకపోయాడు. దీంతో పాండ్యా ప్రస్థానం ముంబై జట్టులో ముగిసే అవకాశం కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా కూడా లక్నో లేదా కోల్కతా జట్టుకు సారథిగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. హార్థిక్ పాండ్యా తన భార్య నటాషా తో విడాకులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం మహిక శర్మ అనే యువతి […]

Hardik Pandya Mahika Sharma: ముంబై ఇండియన్స్ సారధిగా హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు. వరుసగా మూడు సీజన్లలో తన స్థాయి ఆట తీరు కొనసాగించలేకపోయాడు. దీంతో పాండ్యా ప్రస్థానం ముంబై జట్టులో ముగిసే అవకాశం కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా కూడా లక్నో లేదా కోల్కతా జట్టుకు సారథిగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

హార్థిక్ పాండ్యా తన భార్య నటాషా తో విడాకులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం మహిక శర్మ అనే యువతి తో సంబంధం లో ఉన్నాడు. వీరిద్దరూ పీకల లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరు కనిపిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెకేషన్ కూడా వెళ్తున్నారు. హార్థిక్ పాండ్యా ఆడుతున్న ప్రతి మ్యాచ్ కు మహిక హాజరవుతున్నారు. వీరిద్దరూ తమ రిలేషన్ దాచుకోవడానికి ఏమాత్రం భయపడటం లేదు.

హార్దిక్ పాండ్యా ఆట తీరు సరిగా లేకపోవడానికి ప్రధాన కారణం మహీకా అని అతని అభిమానులు విమర్శిస్తున్నారు. ఆమె అతడి జీవితం రాకముందు హార్దిక్ ఆటతీరు గొప్పగా ఉండేదని.. ఇప్పుడు అధమ స్థాయి ప్రదర్శన చేస్తూ హార్దిక్ పాండ్యాలు విమర్శలు మూట కట్టుకుంటున్నాడని అతడి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహిక శర్మ విషయంలో రకరకాల ఆరోపణలు చేస్తున్న హార్దిక్ అభిమానులు ఇబ్బంది పడే వార్త ఒకటి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. మహికాను ఈనెల 22న హార్థిక్ పాండ్యా పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రియురాళ్లతో హోటల్ గదిలోకి రావడానికి అనుమతి లేదని ఇటీవల బిసిసిఐ నిబంధన విధించింది. దీంతో మహిక ను విడిచిపెట్టి ఉండలేక హార్దిక్ పాండ్యా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

బీసీసీఐ విధించిన నిబంధనకు చెక్ పెట్టేందుకు తనకు ఇంతకుమించిన మార్గం లేదని అందువల్లే పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై హార్దిక్ అభిమానులు సోషల్ మీడియాలో స్పందించారు. ఇవన్నీ కూడా ఊహాగానాలని.. ఇప్పుడప్పుడే హార్దిక్ పెళ్లి చేసుకోలేడని.. దానికి ఇంకా సమయం పడుతుందని అతని అభిమానులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper